ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంచలనలా ముఖ్యమంత్రిగా ఇప్పటికే అయన పేరు తెచ్చుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయం తీసుకొని ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు జగన్ మరో వరం ఇచ్చాడు.       


వివరాల్లోకి వెళ్తే .. మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో మొదట పరిశీలన చేయాలని వారికీ సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌కు తరలి వెళ్లిపోతున్నారని,             


ఆ మత్స్యకారులంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు సీఎం జగన్. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ (నిన్న) శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్బంగా జగన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.        


కాగా భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై అధికారులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నియంనించాలని అయన సూచించారు. గుజరాత్, చెన్నైకి వలస వెళ్లిన మత్స్యకారులు జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో తిరిగి వస్తారు.                


మరింత సమాచారం తెలుసుకోండి: