కరకట్ట మీద నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణంలో నుండి ఖాళీ చేయటానికి చంద్రబాబునాయుడుకు వారం రోజులే గడువుంది. ఉరుము లేని పిడుగు లాగ  సిఆర్డీఏ అక్రమ నిర్మాణం యజమాని లింగమనేని రమేష్ కు నోటీసులు జారీ చేసింది.  చంద్రబాబు నివాసముంటున్న అక్రమ నిర్మాణం యజమాని లింగమనేని రమేష్ అన్న విషయం అందిరికీ తెలిసిందే.

 

అక్రమ నిర్మాణాన్ని ఖాళీ చేయాలంటూ గతంలోనే లింగమనేనికి సిఆర్డీఏ నోటసులిచ్చింది. అయితే ఆ నోటీసును లింగమనేని లెక్క చేయలేదు. నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేసిన వాటిని తొలగించాలన్నది సిఆర్గీఏ ఉద్దేశ్యం. అయితే రెండుసార్లు వచ్చినా లింగమనేని అయితే లెక్క చేయలేదు. ఇంతలో వరదలు, ముంపు తదితల సమస్యలు రావటంతో అసలు విషయం వెనక్కుపోయింది.

 

అయితే తాజాగా సిఆర్డీఏ లింగమనేని మళ్ళీ నోటీసిచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మిగ్ పూల్, గ్రౌండ్ లెవల్లోని డ్రెసింగ్ రూమ్ తదితరాలన్నీ అక్రమ నిర్మాణాలే అంటూ సిఆర్డీఏ ఫైనల్ చేసింది. కాబట్టి అక్రమ నిర్మాణాలను వారం రోజులుగా క్లియర్ చేయాలని అల్టిమేటమ్ ఇచ్చింది. లింగమనేని గనుక తమ నోటీసుకు స్పందించకపోతే తామే రంగంలోకి స్వయంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామంటూ ఘాటుగా చెప్పింది.

 

నిజానికి  కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణం అసలు లింగమనేనిదేనా లేకపోతే చంద్రబాబుదా అన్నదే తేలలేదు. చంద్రబాబు ఇదే విషయమై మాట్లాడుతూ ఒకసారి ప్రైవేటు భవనమంటారు. మరోసారి ప్రభుత్వానిదే అంటు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దాంతో అసలు భవనం యజమాని ఎవరనే విషయంలో జనాలందరినీ అయోమయానికి గురి అవుతున్నారు.

 

అందుకనే జనాల్లో ఉన్న అయోమయానికి తెరదింపాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అంటే ప్రభుత్వం వరస చూస్తుంటే చంద్రబాబును కరకట్ట నివాసం నుండి ఖాళీ చేయించటం ఖాయమనే అనిపిస్తోంది.  నోటీసు లింగమనేని ఒక్కడికే కాకుండా మరో ఐదుగురికి కూడా ఇచ్చింది లేండి.  మరి తాజా నోటీసును చంద్రబాబు ఏ స్ధాయిలో రచ్చ చేస్తారో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: