సమాజంలో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. బంధాలు... అనుబంధాలు... మానవత్వం మంట కలిసిపోతున్నాయి. ఒక్కోసారి మనం ఇలాంటి విషయాలు వింటున్నామో ఊహకే అందని పరిస్థితి. తాజాగా జ‌ర్మ‌నీ దేశంలో జరిగిన ఓ సంఘటన షాకింగ్ గా మారింది. ఈ దేశ‌స్ధుల‌కు మంచి సాంప్రదాయ వాదులుగా పేరుంది. అలాంటి దేశంలో ఒక పెద్దమనిషికి విచిత్రమైన ఆలోచన వచ్చింది. తను ఎంత ప్రయత్నించినా తన భార్యను ప్రెగ్నెంట్‌ చేయలేకపోవడంతో ఆ పెద్దమనిషి తన పక్కింటి కుర్రాడైన జోస్‌తో ఒక ఒప్పందం చేసుకున్నాడు.


ఈ  కాంటాక్ట్ లో భాగంగా ఆరు నెలలు గడిచినా అగ్రిమెంట్ ప్రకారం ఆ పెద్దమనిషి భార్య గర్భవతి కాలేదు. దీంతో ఆ కుర్రాడిని డాక్ట‌ర్ల దగ్గరికి తీసుకెళ్లి ప‌రీక్ష‌లు చేయించాడు. ఆ కుర్రాడి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో తనను మోసం చేశాడంటూ ఆ పెద్దమనిషి జోస్‌ఫై కోర్టుకు వెళ్ళాడు. ఈ సందర్భంగా జోస్ త‌న వాదనలు తాను వినిపించాడు. ఆరు నెల‌ల పాటు మొత్తం 72 సార్లు ఆమెకు గ‌ర్భం వ‌చ్చేందుకు త‌న ప్ర‌య‌త్నం తాను చేశాన‌ని.. అయినా ఆమె గ‌ర్బం దాల్చ‌క‌పోవ‌డంలో త‌న త‌ప్పు లేద‌ని చెప్పాడు.


ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఇచ్చిన 2500 యూరోలు తిరిగి ఇచ్చేది లేదని తేల్చేశాడు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.2 ల‌క్ష‌లు ఈ భ‌ర్త ఆ యువ‌కుడికి ఇచ్చాడు. ఆ భ‌ర్త మాత్రం త‌న భార్య‌ను ప్రెగ్నెట్ చేయ‌నందున త‌న డ‌బ్బు త‌న‌కు ఇచ్చేయాల‌ని చెపుతున్నాడు. మ‌రి ఈ విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌పై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయినా.. ఇలాంటి దరిద్రపుగొట్టు ఒప్పందాలు చేసుకునే ముందు..ఆ కుర్రాడి సామ‌ర్థ్యంపై ఒక టెస్ట్ చేసేస్తే స‌రిపోయేది క‌దా..!


మరింత సమాచారం తెలుసుకోండి: