తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా యురేనియం మైనింగ్ గురించి ఎంత పెద్ద చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం నిల్వల కోసం మైనింగ్ చేపడతామని వార్తలు వస్తున్నప్పటి నుండి నిరసన గళాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. యురేనియం మైనింగ్ వల్ల జీవ వైవిధ్యం దెబ్బ తింటుందని, అంతే కాకుండా పక్కనే ఉన్న క్రిష్ణా నది నీరు కలుషితం అవుతుందని ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించారు.

ఈ నిరసన గళాలు శాసనసభను కూడా తాకాయి. ఎట్టకేలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు నల్లమలలో మైనింగ్ చేపట్టడానికి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఈ మైనింగ్ ని వ్యతిరేకించారు. అయితే ఇదే విషయమై ప్రతి పక్ష నాయకుడు రేవంత్ రెడ్డి మైనింగ్ కి వ్యతిరేకంగా తన గొంతు విప్పారు. వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు.


ఈ విషయమై రేవంత్‌ రెడ్డి ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ నేత సంపత్‌ను ఉద్దేశించి యురేనియం మైనింగ్‌ విషయమై ఆయనకు ఏం తెలియదు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మాట వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంపత్‌ సీరియస్‌ అయ్యాడు. పీహెచ్‌డీ చేసిన నాకు యురేనియం పై ఏమీ తెలియదు అన్నాడు. ఆయనలా నేను నోటికి ఏది వస్తే అది మాట్లాడలేను.


ఏది మాట్లాడాలన్నా ఆలోచించే మాట్లాడతాను అన్నాడు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పరస్పరం విమర్శించుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ వాదన ఇక్కడితో ఆగిపోతుందా? లేదా మరింత ముందుకు వెళ్తుందా అనేది ఆసక్తిగా మారింది. వీరిద్దరి మధ్య గొడవ ముందుకు వెళ్ళకుండా సద్దుమణిగే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: