ఈరోజు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 2వ తేదీన హర్యానా అసెంబ్లీ టర్మ్ ముగియనుంది. నవంబర్ 9వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ టర్మ్ ముగినయనుంది. మహారాష్ట్రలో 288 సీట్లకు, హర్యానాలో 90 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్రలో 8.9 కోట్ల మంది ఓటర్లు, హర్యానాలో కోటి 82 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. హర్యానాలో లక్షా 30 వేల ఈవీఎంలు, మహారాష్ట్రలో 1.8 లక్షల ఈవీఎంలు ఉపయోగించనున్నారు. 
 
అక్టోబర్ 21వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. 24వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈరోజు నుండే ఎన్నికల కోడ్ అమలులోకి రావటం జరిగింది. బీజేపీ పార్టీ ప్రస్తుతం హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్నికల నగారా మోగటంతో రెండు రాష్ట్రాల్లో పార్టీలన్నీ ఎన్నికల ప్రణాళికలను తయారు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 
 
ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు సునీల్ అరోరా చెప్పారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని చెక్ పోస్టుల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. రాజకీయనేతలు ప్రచారంలో ప్లాస్టిక్ నిషేధించాలని సునీల్ అరోరా కోరారు. బీజేపీ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. 
 
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సునీల్ అరోరా తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన తరువాత అక్టోబర్ 4వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 5వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ చాలా పట్టుదలగా ఉంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: