సినీనటుడు,చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అంటే తెలియని వారుండరు.ఈయన పరిచయం అక్కర్లేని వ్యక్తి.సినీనటుడిగా తన జీవితంలో ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఆయన చేసే నిరసనల ద్వారా మాత్రం జాతీయ స్థాయిలో పేరుగాంచారు.స్వతహాగా సినీ నటుడైన శివప్రసాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు తన విలక్షణ శైలి,విచిత్ర వేషధారణల తో నిత్యం వార్తల్లో ఉండేవారు.ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా ఎంజీ రామచంద్రన్, కరుణానిధి,అంబేద్కర్,ఇలా ఎందరో ప్రముఖుల వేష‌ధార‌ణ‌లు ధరించి అలరించేవారు.శివప్రసాద్ వేషాలకు జాతీయ నేతలు సైతం ఫిదా అయ్యారు.ఇక ప్రధాని నరేంద్రమోదీ పైనా,కేంద్రప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో శివప్రసాద్ తన వేషధారణలతో నిరసన తెలపడానికి ముగ్ధురాలయ్యారు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ.అంతేకాదు సమావేశాల నుంచి బయటకు వచ్చి శివప్రసాద్ ను అభినందించడంతోపాటు ఓ సెల్ఫీకూడా దిగారు.



అటువంటి శివప్రసాద్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.కాగా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు.ఆయన వయస్సు అరవై నాలుగు సంవత్సరాలు.ఇకపోతే చంద్రబాబునాయుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ క్లాస్‌మేట్స్. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో వీరిద్దరూ కలిసి చదువుకొన్నారు.తిరుపతి నుండి ఆయన పలు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడ పనిచేశారు.



ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో పాటు పలు సమకాలీన అంశాలపై పార్లమెంట్ ఎదుట వినూత్న రీతిలో వేషాలు వేసి తన నిరసనను తెలిపేవాడు శివప్రసాద్.కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రిలో శివప్రసాద్‌ను పరామర్శించారు కూడా కాని ఇంతలోనే ఆయన మరణవార్త వినడం చాల బాధాకరమంటు తెలిపారు..మరోవైపు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా శివప్రసాద్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన పలు చిత్రాల్లో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: