తెలుగుదేశం పార్టీకి వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  ఎప్పుడు లేని విధంగా కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.  దీంతో బాబు దిగాలు పడ్డాడు.  అటు పార్లమెంట్ విషయంలోనూ కేవలం 3 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంది.  2014 పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.  2014లో పార్లమెంట్ ఎంపీగా గెలిచిన వ్యక్తుల్లో నరమల్లి శివప్రసాదరావు ఒకరు.  


అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటికి క్రితమే మరణించారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న చెన్నై వెళ్లి శివప్రసాదరావును పరామర్శించి వచ్చారు.  ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.  ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోనే ఇలా చనిపోయారని వార్తలు రావడం బాధాకరమైన విషయం అని చెప్పాలి.  


శివప్రసాదరావు చంద్రబాబు మధ్య మంచి అనుబంధం ఉన్నది.  ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులు కావడంతో పాటు కలిసి కొన్నాళ్ళు చదువుకున్నారు కూడా.  ఆ స్నేహంతోనే శివప్రసాదరావును రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.  ఎంపీగా రెండుసార్లు అయన విజయం సాధించారు.  కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న 2009 లో మొదటిసారి ఎంపీగా ఎంపికయ్యారు.  చిత్తూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఆ తరువాత 2014లో కూడా చిత్తూరు నించి ఎంపీగా గెలుపొందారు.  


అయితే, విభజన సమయంలో శివప్రదసరావు విచిత్రమైన వేషధారణతో అందరిని ఆకట్టుకున్నాడు.  రోజుకో వేషం వేస్తూ పార్లమెంట్ దగ్గర అందరిని ఆకట్టుకున్నాడు.  విచిత్రమైన వేషాలు వేసుకొని అక్కడి నాయకులను ఆప్యాయంగా పలకరించేవారు.  నాయకులు కూడా శివప్రసాద్ వేషానికి ముగ్దుడయ్యేవారు. పార్లమెంట్ నాయకులు సైతం శివప్రసాద్ ఏ వేషం వేసుకొని వస్తారా అని ఎదురు చూసేవారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  పార్లమెంట్ లో ఎంతమంది అభిమానులు ఉన్నారో.  శివప్రసాద్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: