ఈ భూమి మీద పుట్టే ప్రతివారు ఏదో ఓ ప్రత్యేకతతో పుడుతారు.కొందరు నటులుగా,మరికొందరు రాజకీయ వేత్తలుగా,ఇంకా వ్యాపారవేత్తలు,శాస్త్రజ్ఞులుగా ఇలా దేనిలో ఒకదాంట్లో తమ ప్రత్యేకతను చాటుతారు.కొందరు మాత్రమే ప్రత్యేకతకు,పూర్తి అర్ధంగా మారుతారు.వారిలో నటుడు,రాజకీయ నాయకుడు శివప్రసాద్ ఒకరు.ఆయన నటించిన సినిమాలు. ఆయన వేసిన వేషాలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చూ.ఇంతలా నవ్విస్తూ,జీవించేవారు బహుశా ఇప్పుడు రాజకీయాల్లో గాని,సినిమాల్లో గాని లేరు ఎందుకంటే ఆయన నటనలో,రాజకీయ జీవితంలో హస్యమనే రెండు పాత్రలు సమర్ధవంతంగా పోషించారు.



ఆయన ప్రత్యేక హోదా ఉద్యమం సమయంలో నిరసన తెలిపిన విధానాలకు ముగ్ధులవ్వని వారుండరు.ఎందరో ప్రముఖుల వేష‌ధార‌ణ‌లు ధరించి,చిత్ర,విచిత్రంగా తనదైన మాండలీకంలో తెలియపరచడం నిజంగా గొప్పకళ.విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. సమైక్యాంధ్ర కోసం, ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ఎదుట వివిధ వేషాలలో నిరసన తెలిపిన నేత శివప్రసాద్.కృష్ణుడు, రాముడు,ఎన్టీఆర్.వేషాల్లో నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ మొదలు అందరినీ తన వైపు తిప్పుకునే వారు. ఇలాంటి నిరసనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక 1999-2004 మధ్యకాలంలో ఎంఎల్ఎగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార,సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు,తర్వాత చిత్తూరు ఎంపీగా 2009, 2014లలో  గెలుపొందారు.తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు.



నాటకరంగంలో వివిధ పాత్రలు వేసిన ఆయన ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.1983 నుండి 2013 వరకూ ముప్పై‌గా పైగా చిత్రాల్లో నటించారు. ఈయన నటడుగానే కాకుండా అనేక నాటకాలకు, సినిమాల్లో నటిస్తూనే,దర్శకత్వం వహించారు.ఇక రాజకీయాల్లో కాని,సినిమాల్లో గాని ఇలాంటి నటుడు మరొకరు లేదనిపించిన శివప్రసాద్ శనివారం మధ్యాహ్నం మరణించారు. నిజంగా ఆయన మరణం తీరని లోటు.ఎవరు తీర్చని లోటు.ఇక శివప్రసాద్ మృతి పట్ల పలువురు నటులతో పాటుగా రాజకీయ నాయకులు,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు.ఇక కళామతల్లి మరో నవ్వుల నాయకున్ని కోల్పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: