మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన నటుడు శివ ప్రసాద్. రంగస్థల నాటకాల్లో ఎన్ని వేల నాటకాలు వేసాడు. ఎప్పుడు అయన ఓ మాట అంటుండేవాడు. నేను పెద్ద నటుడు కాదు.. నటన మీద ఇష్టంతోనే నేను నాటకాల్లోకి వచ్చాను. నా నటన ప్రతిభను ప్రజలకు చూపించడానికి అటు వెళ్ళాను అని చెప్తుండేవాడు. 


కేవలం నాటకాలపై ఉన్న మక్కువతోనే చాలా సినిమాలలో నటించి వాటికి పారితోషకం కూడా తీసుకోకుండా నటించాను అనేవారు శివ ప్రసాద్. అలా ఎవరికీ తెలియని విషయాలను అయన అందరితో పంచుకున్నాడు. అలా ఆయన తన ఆరొవ తరగతిలో ఉన్నప్పుడే నాటకాల్లో ఎంటర్ అయ్యాడట. 


మొదటగా ఆయన నడిచిన నాటకం ముందుంజ అనే నాటకంలో కనిపించాడు. ఆ తర్వాత పదోతరగతిలో పరువు కోసం అనే నాటకం నటించాడు. ఆ కాలేజీలో నటించాడు. అక్కడ చాలా మంది డైరెక్టర్లు ఉండటం వల్ల సినిమా అవకాశాలు కొట్టేసాడు. కొత్త జీవితాలు అనే సినిమాలో మొదటగా నటించారు. ఆ సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం రావడంతో.. నేను ఆ సినిమాకు పారితోషం కూడా తీసుకోలేదు. 


ఆ తర్వాత ఖైదీ, పోరాటం, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సక్సెస్ సినిమాలలో అయన నటించారు. 6 వేలతో మొదలైన ఆ పారితోషికం అలా పెరుగుతూ వచ్చింది. కేవలం డబ్బులతో పాటుగా పాపులారిటీని కూడా పెంచుకుంటూ వచ్చాడు. నటన అంటే పిచ్చి లేదు కానీ, ఎదో అలా కలిసి వచ్చింది. ఓ ఎంపీ గా ఉండి కూడా నేను నటించాను అని అయన వెల్లడించారు. నటనను, అటు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శివ ప్రసాద్. ఇక రాజకీయాల్లో రాష్ట్ర విభజన సమయంలో వివిధమైన  గెటప్ లతో అసెంబ్లీ ముందు బయటాయించి చెరగని ముద్ర వేసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: