రాజకీయాలను గత కొన్ని రోజులుగా మరణాలు వెంటాడుతున్నాయి.  కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడంతో పెద్ద దుమారం రేగింది.  అయన మరణం అందరిని షాక్ కు గురిచేసింది.  పలనాడు పులిగా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు.  ఎందుకు అలా జరిగిందో ఇప్పటికి ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది.  


ఇక ఇదిలా ఉంటె, ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాదరావు మరణం ఆ పార్టీని మరింత కలిచివేసింది.  వారం రోజుల వ్యవధిలో ఇద్దరు నేతలను కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పాలి.  ఈ సంవత్సరం ఎస్ అనే పేరుతో ఉన్న ప్రముఖ వ్యక్తులు, నాయకులు మరణించడమో లేదంటే వివాదాల్లో చిక్కుకోవడమో జరుగుతుండటం విచారకరమైన విషయం.  ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించిన సంగతి తెలిసిందే. 


ఆమె మరణించిన కొద్దికాలానికి బీజేపీ సీనియర్ లీడర్ మాజీ కేంద్రమంత్రి సుష్మాపై స్వరాజ్ మరణించారు.  ఇది మరింత విచారించదగిన విషయం.  అంతకు ముందు కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్ధ్ ఆత్మహత్య చేసుకున్నారు.  ఇవే కాదు.. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ వివాదాల్లో చిక్కుకోవడం.. అటు ఏపీ మంత్రులు బొత్స సత్యన్నారాయణ, వేంపల్లి శ్రీనివాస్, సుచరితలు కూడా కొన్ని రకాల వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.  ఇలా ఎస్ అనే అక్షరం ఈ సంవత్సరం ఆందోళన కలిగించే విధంగా మారడంపై ఆస్ట్రాలజీ నిపుణులు కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.  


జులై 16, 2019లో ఏర్పడిన చంద్రగ్రహణ ప్రభావం వలన ప్రముఖులు మరణిస్తున్నారని అందులోను ఎస్ అక్షరం ఉన్న నేతలకే జరుగుతుందని వాస్తు పురుష ప్రసాద్ పేర్కొన్నారు.  రాజకీయ ప్రముఖుల్ని అపమృత్యుదోషం ఏర్పడుతుందని,  గతంలో తాను చాలా మందికి ఇదే విషయాన్ని చెప్పానని.. అదే నిజమవుతోందన్నారు. శాస్త్రము ఎప్పుడు తప్పుకాదని.. ఇంకా ఇలా ఎన్ని చూడాల్సి వస్తుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలు మాత్రమే కాదు కోర్టు కేసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చని అయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అయన సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: