కాంగ్రెస్ హయాంలో పాక్ ఆటలు కాశ్మీర్లో సాగుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కాశ్మీర్ కాదు కదా .. ఇప్పుడు తమ భూబాగంలో ఉన్న పీఓకేనే కాపాడుకోవాల్సిన పరిస్థితి. భారత్ తో యుద్ధమే జరిగితే పాక్ ఓడిపోతుందని ప్రపంచదేశాలతో పాటు పాక్ కు కూడా తెలుసు. భారత్ నుంచి పీఓకేను కాపాడుకోవటం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ముందు ఉన్న పెద్ద సవాలు. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలను గమనిస్తే .. కాశ్మీర్ లో జిహాదీ ప్రకటించొద్దని .. సంధు దొరికితే భారత్ పీఓకే మీద విరుచుకుపడటానికి సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ గురించి పాక్ మాట్లాడినప్పుడల్లా భారత్ కేవలం మన అధీనంలో ఉన్న కాశ్మీర్ గురించి మాత్రమే చెప్పేది. అయితే భారత్ ఇప్పుడు తన పంథాను మార్చుకొని పీఓకే గురించి మాట్లాడుతూ ఎదురు దాడికి దిగుతుంది. ఒక దేశం అభివృద్ధిపధంలో ఉండాలంటే పొరుగు దేశాలు కూడా మంచివి అయి ఉండాలి.


మన ఖర్మ ఏంటంటే మన పక్కన పాకిస్థాన్ ఉండటం .. దేశంలో ఉగ్రదాడులు జరిపి దేశాన్ని అస్థిర పరచాలని చాలా సార్లు ఉగ్రమూఖలను భారత గడ్డ మీదకు పంపించింది.అయితే ఇప్పుడు కాశ్మీర్ విషయంలో మరో దేశంలో మారణ హోమం జరపాలని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పాక్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి దాడులు జరపాలని భావిస్తునట్టు భారత్ ఇంటెలిజెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేడియో సిగ్నల్ ద్వారా పాక్ ఆర్మీ కాశ్మీర్ లో ఉన్న కొంత మందితో మాట్లాడ్తున్నట్టు తెలుస్తుంది.


అయితే ఈ సారి పాక్ ఎటువంటి విధ్వంసానికి పాల్పడిన భారత్ పీఓకే లోకి దూసుకుపోవటం ఖాయంగా కనిపిస్తుంది. కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాక్ లేవనెత్తడంతో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాశ్మీరు మా అంతర్గత వ్యవహారం. ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించమని గట్టి హెచ్చరిక చేసింది. ఇప్పటికే పలు దేశాలు కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన సంగతీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: