నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూయడంతో ఆయన అభిమానులు, టిడిపి వర్గాలు,  కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పార్టీకి  పెద్దదిక్కుగా ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప నాయకుడిని కోల్పోవటం  విచారకరమని పలువురు నేతలు ఆయనకు సంతాపం తెలియజేశారు. ఆయన ఏ పని చేసినా అది ప్రత్యేకంగా  ఉండేది . ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని ఏదో వివిధ  వేషధారణల్లో   పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే  

 

 

రంగస్థల నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒడిదుడుకులు ఎదుర్కొని నాటక రంగం నుంచి వెండితెర వరకు వెళ్లారు శివప్రసాద్ . ఎన్నో విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శివప్రసాద్ . నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలని సినీ ప్రేక్షకులకు అందించారు. అనంతరం ప్రజా సేవ చేయడానికి శివప్రసాద్  రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీలో చేరి పార్లమెంటు సభ్యుడు వరకు వెళ్లారు. పార్లమెంట్ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రానికి న్యాయం చేకూర్చడానికి పోరాటాలు చేస్తారు. 

 

 

 అయితే దివంగత ఎంపీ శివప్రసాద్   అప్పట్లోనే కులాంతర వివాహం చేసుకున్నారట . శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఎంబీఏ పూర్తి చేసిన శివ  ప్రసాద్ కి ... అక్కడే విద్యనభ్యసిస్తున్న ఆయన సతీమణి విజయలక్ష్మి తో సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే అది కాస్త ప్రేమగా మారింది. కాగా అందరితో సరదాగా ఉండటం ఎప్పుడు నవ్వుతూ మాట్లాడటం వలన తన భార్య తనను  ప్రేమించిందని   ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే శివ ప్రసాద్ ది రెడ్డి సామాజిక వర్గం కాగా  ఆయన సతీమణి విజయలక్ష్మి ది  దళిత సామాజిక వర్గం కావడంతో పెళ్లి అంత సులువుగా జరగలేదని బెదిరింపులు  ఎదుర్కొన్నట్లు శివప్రసాద్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: