తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో నిర్ణయాన్ని మెల్లిగా తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నది.  ముఖ్యంగా ఐటి రంగంపై దృష్టి పెట్టింది.  ప్రపంచంలోనే ప్రముఖ సంస్థలు ఇండియాలో అది హైదరాబాద్ లో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి.  ఒకప్పుడు ఐటి అంటే బెంగళూరు, పూణే, గూర్గాన్ అలా ఉండేది.  కానీ, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.  ఇండియాలో ఐటి ఇండస్ట్రీ పెట్టాలి అంటే దానికి హైదరాబాద్ అనుకూలమైన ప్రదేశం అని భావించి హైదరాబాద్ లో ఆఫీస్ లు ఏర్పాటు చేస్తున్నారు. 


దీంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.  అయితే, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మీద మాత్రమే దృష్టిపెట్టి.. మిగతా ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతున్నది.  ఇది వేరే సంగతి అనుకోండి.  అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం ఓ సినిమా రంగం విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  


ఇప్పటి వరకు సినిమాకు వెళ్ళాలి అంటే ఆన్లైన్ లో టికెట్స్ కొనుగోలు చేసుకొని సినిమాకు వెళ్లారు.  టికెట్ ధరతో పాటు సర్వీస్ టాక్స్, నెట్ టాక్స్ తో పాటు అదనంగా కొన్ని టాక్స్ లు వేసి టికెట్ అమ్ముతారు.  150 రూపాయల టికెట్ చేతికి వచ్చే సరికి రూ. 180 రూపాయలు అవుతుంది.  దీనిపై తెరాస ప్రభుత్వం దృష్టిపెట్టింది.  సినిమా టికెట్స్ ను ఆన్లైన్ లో అమ్మకాలను రద్దు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నది.  


కాగా, ఆన్లైన్ ద్వారా టికెట్స్ ను అమ్మకాలను రద్దు చేసి.. ప్రభుత్వమే టికెట్ టికెట్స్ ను అమ్మాలని నిర్ణయం తీసుకోబోతుందట. దీని వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభం పొందుతారని, ఇప్పటిలా కష్టాలు ఉండవని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.  అయితే ఏ విధంగా లాభమో, ఎలా టికెట్స్ ను అమ్మబోతున్నానే విషయాలను తెలియజేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: