వరద బాధితులకు 15 శాతం మేరకు అదనంగా పంట నష్ట పరిహారాన్ని అందచేయనున్నట్టు రాష్ట్ర పురపాలక  శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరదబాధితులకు, పంట నష్టం వాటిల్లిన ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం ఇస్తున్న నష్ట పరిహారానికి 15 శాతం అదనంగా కలిపి ఇవ్వాలన్నారు. ఇందుకు  వరద, పంట నష్టం వివరాలపై నివేదికలను సపర్పించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స అధికారులను  ఆదేశించారు. సీఎం నంద్యాల పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళ్లిన అనంతరం ఆయన సహాయక చర్యల పై దృష్టి పెట్టారు.  



ముఖ్యన్తరు వై ఎస్ జగన్ ఆదేశాల మేరకు నంద్యాల డివిజన్ పరిధిలో సంబవించిన  వరదలపై మునిసిపల్ ఆఫీసు మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రి బొత్స కొనసాగించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి గా సత్యనారాయణ నిర్విహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యులు, కర్నూల్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. 




ఆనంతరం వరద బాధితులకు ప్రభుత్వపరంగా నష్ట పరిహారాన్ని అందించే క్రమంలో  వరదల్లో కొట్టుకుపోయిన ఇరువురి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని మంత్రి బొత్స అందజేశారు. ఈ సందర్బంగా బాధితులకు బియ్యం తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటుగా సహచర మంత్రి గుమ్మనూరు జయరాం, శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ రెడ్డి, కాటసాని రామిరెడ్డి , జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జెసి రవి పట్టన్ శెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: