ఆంధ్రప్రదేశ్ లో  గ్రామ సచివాలయం పరీక్షల పేపర్ లీకేజీ రగడ  దుమారం రేపుతోంది. ఒకేసారి లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా. దానికోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించింది. అయితే పరీక్షలు నిర్వహించిన 10 రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను వెల్లడించింది ప్రభుత్వం. అయితే మునుపెన్నడూ  లేని విధంగా పదిరోజుల్లో ఫలితాలు వెల్లడించి జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. కాక పరీక్షలో చాలా మంది విజయం సాధించారు. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయాలు పరీక్షల ఫలితాలపై ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి . కేవలం ఏపీపీఎస్సీలో పనిచేసే  వాళ్ళ బంధువులకు మాత్రమే  టాప్ ర్యాంకులు  వచ్చాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం పరీక్ష పత్రాలను లీక్ చేసిందని  అందువల్లే ఇలాంటి ఫలితాలు  వచ్చాయి అని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిపై స్పందించిన మంత్రులు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేయడం చూసి ఓర్వలేక నే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

 

 

 అయితే ఈ  నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. తమ జీవితాలు మారుతాయని ఎంతో నమ్మకంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు... వ్యవస్థ తమని మోసం చేసిందని అనుకోకూడదు అని.... నేతల అండ ఉన్న వారికే  ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయం వాళ్ళలో రాకుండా చూసేందుకు ప్రభుత్వం చెబుతున్న పారదర్శకతను చేతల్లో చూపెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు . ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: