చంద్రబాబుకు స్నేహితులు తక్కువ అంటారు. రాజకీయాల్లో కూడా ఆయనతో మొదటి నుంచి ఇప్పటివరకూ  ప్రయాణం చేసిన వారు తక్కువ. ఆ మధ్య చంద్రబాబు అసెంబ్లీలో నా బెస్ట్ ఫ్రెండ్ వైఎస్సార్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వైఎస్ ని ఎపుడూ శత్రువుగానే చూశారని తరువాత ఓ ఇంటర్వ్యూలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి దాన్ని  ఖండించారు.


ఇదిలా ఉండగా చంద్రబాబుతో పాటు స్కూల్లో చదువుకుని, రాజకీయాల్లో కూడా అయనతో కలసి పనిచేసి ఏకవచనంతో బాబుని పిలవగల చనువు ఉన్న నాయకుడు ఒకరు ఉన్నారు. ఆయనే  చిత్తూరు జిల్లా మాజీ మంత్రి శివప్రసాద్. ఆయన బాబు కలసి అరవై దశాబ్దంలో ఒకే స్కూల్లో చదువుకున్నారు. చనువు పెంచుకున్నారు. తరువాత శివప్రసాద్ డాక్టర్  కోర్స్ చదివేందుకు వెళ్తే బాబు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.


ఇక చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు. తరువాత కాలంలో ఎన్టీయార్ అల్లుడిగా టీడీపీలో చక్రం తిప్పారు. అపుడు తన సొంత జిల్లాలో తనతో పాటే చదువుకుని వైద్యునిగా మంచి పేరున్న వ్యక్తి. అలాగే నటుడుగా కూడా ప్రతిభను చూపిన డాక్టర్ శివప్రసాద్ ని రాజకీయాల్లోకి తెచ్చారు. అలా శివప్రసాద్ 1999 ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేసి బాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014, 2109 ఎన్నికల్లో ఆయన  చిత్తూరు  ఎంపీగా గెలిచారు.


ఆయన గెలుపునకు చంద్రబాబు కుప్పం నియోజకవర్గం ఓట్ల మెజారిటీ కలవడమే ప్రధాన కారణం. ఈసారి కుప్పంలో బాబు మెజారిటీ సగానికి సగం పడిపోవడంతో శివప్రసాద్ ఓటమి పాలు అయ్యారు. మొత్తానికి చూస్తే బాల్య స్నేహితుడిగా బాబుతో చదువుకుని అదే బాబు రాజకీయ బడి నుంచి ఓనమాలు దిద్దిన శివప్రసాద్ కన్నుమూత చంద్రబాబుకు ఓ విధంగా లోటుగానే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: