రాజకీయాల్లో ముందుకు వచ్చేందుకు చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిని ఎవరు ఎలా ఎంచుకుంటారన్నది వారి వివేచనకే వదిలేయాలి. వర్తమాన కాలంలో రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. సవ్యంగా రాజకీయం చేసే  పద్ధతులే పోయాయి. చెప్పేది ఒకటి చేసేది మరోకటి. ప్రజలు కూడా వీటిని అలవాటు పడిపోయి అనుమానపు చూపులు చూస్తున్న కాల‌మిది.


ఇక జగన్ పాదయాత్రలో అన్న మాట ప్రకారం లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అది కూడా కేవలం మూడున్నర నెలల కాలంలో దాని మీద బురద జల్లేందుకు విపక్షం రాజకీయం మొదలుపెడితే అవసరమైన సమిధలను పోగు చేయడం ద్వారా ఎల్లో మీడియా తన వంతు పాత్ర ఎప్పటిమాదిరిగానే పోషించింది. ఇక్కడ ఒకటే ఆకాంక్ష,  జగన్ని అన్ పాపులర్ చేయాలి. ఆయన మీద బురద జల్లాలి. అందుకోసం ఫలితాలు  వచ్చిన తరువాత పేపర్ లీక్ అయినట్లుగా టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తే అదే నిజమని పట్టుకుని విపక్షం డ్రామాలు మొదలుపెట్టింది. ఇక్కడ అభ్యర్ధులు వారి జీవితాలు, మనోభావాలు అన్నీ మరచిపోయి రాక్షస క్రీడకు రంగం సిధ్ధం చేయడమే బాధాకరం. పరీక్షా ఫలితాలు తమ వారికి అనుకూలంగా ఇచ్చుకున్నారని టీడీపీ తమ్ముళ్లు పెద్ద నోరు చేసుకుంటున్నారు.



ఇది చాలదన్నట్లుగా జనసేనాని పవన్ కూడా ఇదే రకమైన మాటలు మాట్లాడడం అశ్చర్యంగానే ఉంది. పవన్ టీడీపీ గొంతు నుంచి తన మాటలను అంటూ జగన్ సర్కార్ మీద నిప్పులు చెరగడం బట్టి చూస్తూంటే విపక్షం జగన్ చేసిన మంచి పనులను కూడా ఓర్వలేని స్థితికి చేరుకుందని అర్ధమవుతోంది. నిజంగా పరీక్ష పేపర్ లీక్ అయితే ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదన్న మాట వస్తుంది.



ఆ లాజిక్ మరచిపోయి బురద జల్లాం, ఇక మీరు తుడుచుకోండి, లేకపోతే భరించండి అన్నట్లుగా చేస్తున్న ఈ రచ్చ చూస్తూంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోయాయా అని పెద్దలంతా మధనపడే పరిస్థితి. పిల్లలకు రాక రాక ఉద్యోగాలు వస్తూంటే  అందులో కూడా రాజకీయం చేయాలన్న తాపత్రయం మాత్రం ఎవ‌రూ హర్షించలేనిది. ఈ విషయంలో  క్షుద్ర రాజకీయం ఎవరిది అన్నది ప్రజలే గుర్తించాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: