మన సమాజంలో.. కులం, మతం విపరీతంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ అంశాలు త్వరగా వివాదం అవుతున్నాయి. తాజాగా ఓవైసీపీ మంత్రి ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. ప్రస్తుతం దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎలాగంటే.. గతంలో మాజీ టీడీపీ ఛైర్మన్ సుధాకర్‌యాదవ్ మాదిరిగానే, ఓ క్రైస్తవ సదస్సుకు వెల్లంపల్లిని ఆహ్వానిస్తూ వెలసిన ఫ్లెక్సీ ఇప్పుడు మంత్రిని నైతిక ఇరకాటంలో పడేసింది.


విజయవాడలో సేవకులు, కైస్తవ నాయకుల ఆత్మీయ సదస్సుకు హాజరవుతున్న నాయకులకు సుస్వాగతం అంటూ ఏఐసిసి విజయవాడ సిటీ కమిటీ పేరుతో వెలసిన భారీ ఫ్లెక్సీలు దేవదాయమంత్రిని ఇరుకున పెట్టాయి. అందులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తోపాటు, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల ఫొటోలు కూడా ఉన్నాయి. వారిని పక్కకుపెడితే.. హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించే దేవదాయ శాఖ మంత్రిగా ఉంటూ, ఆయనెలా ముఖ్య అతిథిగా హాజరవుతారన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.


ఇలాంటి వివాదాలు గతంలోనూ చాలా వచ్చాయి. చంద్రబాబు నాయుడు హయాంలో టిటిడి బోర్డు చైర్మన్‌గా చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. ఎన్నికల మందు క్రైస్తవులు నిర్వహించే గుడారాల పండుగ ఫ్లెక్సీపై ఆయనను ఆహ్వానిస్తూ ఫొటో వేశారు. క్రైస్తవుడైన సుధాకర్‌యాదవ్‌కు టిటిడి చైర్మన్ ఎలా ఇస్తారని కొందరు బిజెపి నేతలు కూడా నిలదీశారు. తాను క్రైస్తవుడిని కాదని యాదవ్ చెప్పినా ఎవరూ వినలేదు.


ఇటీవల తాడికొండ ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా, తాను క్రైస్తవురాలినని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం బూమెరాంగయింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి క్రైస్తవురాలు ఎలా పోటీ చేస్తారని హిందూ దళితులు ప్రశ్నించారు. అసలు ప్రస్తుత టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా క్రైస్తవుడేనన్న వివాదం కొంతకాలం నడిచింది. తర్వాత అది అవాస్తవమని తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: