రాజకీయాల్లో ఎపుడూ తన వైపు మాత్రమే  చూసుకుంటూ నడవాలి. ఎదుటి వారు ఎవరైనా తనకు అనవసరం. తనకు ఎంత వరకూ  అది ప్లస్ అవుతోంది అన్నది ఆలోచించాలి. అపుడే ఆ రాజకీయం హిట్ అవుతుంది. ఇపుడు ఉన్న పొలిటికల్ సక్సెస్ మంత్ర అదే. ఇది కరెక్ట్ అవునా కాదా అన్న చర్చ కూడా అనవసరం. ఎందుకంటే రాజకీయమే రొచ్చు కాబట్టి


పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయం ఎపుడూ తన గురించి ఆలోచించి చేస్తున్నట్లుగా అనిపించడంలేదు. ప్రజారాజ్యం లో అన్న కోసం ఆయన రాజకీయాల్లొకి దిగారు. అంతవరకూ బాగానే ఉంది. తరువాత 2014 ఎన్నికల్లో ఆయన చంద్రబాబు కోసం తన గ్లామర్ ని ఫణంగా పెట్టారు. ఇక్కడే పవన్ రాజకీయం తేడా కొట్టింది.


ఇక 2019 ఎన్నికల్లో కూడా బాణాలన్నీ జగన్ మీద సంధించి పవన్ తనదైన రాజకీయాన్ని కాకుండా చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ విపక్ష పాత్రలో కూడా టీడీపీ వైపే మొగ్గు చూపడం విశేషం. తన పార్టీ విధానాలను గొప్పగా ప్రకటించుకున్న పవన్ నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తానని చెప్పి  మరీ  ఆచరణలో మాత్రం టీడీపీ మాట్లాడిన మాటలనే తాను వాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు


బాబు గొంతు వినిపించకు పవన్ మీ రాజకీయాన్ని పాడుచేసుకోవద్దంటూ ఒకనాటి ప్ర్రజారాజ్యం సహచరుడు, ఈనాటి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వంటి వారు చెబుతున్నా పవన్ మాత్రం టీడీపీ బాటలోనే నడవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. గ్రామ సచివాలయం పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆయన ఎంతవరకూ వాస్తవాలను సేకరించారో తెలియదు కానీ టీడీపీ అన్నట్లుగానే లీక్ నిజం అని ఆరోపిస్తున్నారు. మరి పవన్ ఇదే తీరున టీడీపీ కి వంత పాడాలని డిసైడ్ అయి సొంత రాజకీయం పక్కన పెడితే మాత్రం ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: