ప్రముఖ కార్టూనిస్టు మోహన్ వర్ధంతి సందర్బంగా ఆయన లేని లోటును తమ తమ కవితల ద్వారా స్మరించుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమ మాలోవేదనను కవిత రూపంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలుసుకుందామా..నువ్వెళ్ళిపోయావని గోడల మీద రాతల్ని, పోస్టర్లని నిషేధించారు. నువ్వెళ్ళిపోయావని ప్రజోద్యమాలు బక్క చిక్కాయి. నువ్వెళ్ళిపోయావని పదునైన పాళీల ములుకులు విరిగాయి. నువ్వెళ్ళిపోయావని స్నేహం అలిగిపోయింది.



నువ్వెళ్ళిపోయావని బొమ్మలు బావురుమంటున్నాయి. స్నేహపు ఊటని వదిలి ప్రాణం బావిని పూడ్చేసి వెల్లినోడామోహనన్నా..నీకు నివాళులు అంటూ రవికుమార్ లాంటి ఎంతో మంది సాహిత్య ప్రాయులు, కార్టూనిస్టుల హృదయాలు రోదించాయి. బతుకునివ్వడం..బతకనివ్వడం ఒక జీవ కళ. నవ్వడం  నవ్వించడం ఒక ఆదిమ కల. వాస్తవానికి విశేషమైన సాహిత్య అధ్యయనం ద్వారా ఆయన తన కుంచెకు పదును పెట్టుకుంటూ వచ్చారు. ఆయన వేసిన బొమ్మలకు లెక్క లేదు. ఇది మోహన్ గీత అనే విధంగా తన ప్రత్యేక శైలిని చూపించారు. ఆయనకు దాదాపు 67 ఏళ్లు ఉంటాయి. మోహన్ పూర్తి పేరు తాడి మోహన్. ఆయన 1951 డిసెంబర్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. 1970లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి అడుగు పెట్టారు.



చేయివ్వడం చేతవ్వడం హృదయం ఉన్నోళ్ల స్వరం. రెండ్రోజులు పోయాక మీడియాలో వార్తలు సన్నగిల్లాక మీ పొట్టలో వేగే ఆకలి మామూలే. మీ బతుకుల్లో కరువూ మామూలే. మీ ఔదార్యం ముందు మా ఓటమీ... మామూలే. అడవి మధ్య అమ్మ బిడ్డలు మీరు. అడవి మీద హక్కుల మీద పెత్తనం మాదే. నగరాల మధ్య వుండి సమస్త సహజ వనరులకు ఉరి పేనే మేం నాగరీకులమ్ కదా..మోహన్ ఉదయం, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. పొలిటికల్ కార్టూన్లకు ఆయన పెట్టింది పేరు. ఆయన వ్యక్తి కాదు, ఓ స్కూల్. పలువురు పిల్ల కార్టూనిస్టులకు ఆశ్రయం ఇచ్చి, వారికి ఉపాధి మార్గం చూపించిన ఘనత కూడా ఆయనదిని అంటూ మిత్రులు, శ్రేయోభిలాషుల కవితలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: