బొత్స సత్యనారాయణ అనవసరంగా మాట్లాడి ప్రతి పక్షాలకు అవకాశం ఇస్తున్నారని పార్టీలోని కొంత మంది నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇదే విషయం మీద బొత్సకు జగన్ చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బొత్స వ్యాఖ్యలు ఈ మధ్య పెను దుమారం రేపిన సంగతీ తెలిసిందే. బొత్స మీడియా ముందుకు వచ్చి అనవసరంగా ప్రతి విషయాన్ని పెద్దది చేస్తున్నారని ఆఫ్ ది రికార్డు నేతలే చెబుతున్న పరిస్థితి. దీనితో పార్టీ లేని పోనీ ఇబ్బందుల్లో పడుతుంది.  రాజధానిని సాకుగా చూపి ప్రతి పక్ష పార్టీ టీడీపీ నానా హంగామా చేసింది. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు శత విధాలా ప్రయత్నించింది. కానీ చివరికి విఫలమయ్యింది. ఇప్పటికే ప్రతి పక్షాలు నానా రభస చేస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు బీజేపీ .. జనసేన నేతలను కలుస్తున్న పరిస్థితి. దీనితో జగన్ .. మంత్రులతో సమీక్ష నిర్వహించి రాజధాని గురించి క్లారిటీ ఇచ్చారు.


ప్రతి పక్ష పార్టీలు ఈ రాజధాని వ్యవహారాన్ని ఒక రాజకీయ కోణంగా ప్రాజెక్ట్ చేస్తే లభ్ది పొందాలని ఆలోచిస్తున్నారు. దీనితో వైసీపీ పార్టీ అలెర్ట్ అయ్యింది. చాలా మంది మంత్రులు రాజధానిని మార్చే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. అయితే  ముఖ్యంగా మీడియా డిబేట్ లలో కూర్చొని పెద్ద మేధావులుగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూగబోయేటట్లు లేవు. దీనితో బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకుంటే మంచిందని స్వంత నేతలే చెబుతున్నారు. 


నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది.  ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: