టెక్సాస్ లోని హ్యూస్టన్ లో హౌడీ మోడీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ కార్యక్రమంలో దాదాపు 50వేలమంది అమెరికన్ భారతీయలు పాల్గొనబోతున్నారు.  భారతీయ అమెరికన్లను గురించి మోడీ మాట్లాడబోతున్నారు.  అయితే, ఇదే సమయంలో నాలుగు రోజుల క్రితం ఈ కార్యక్రమంలో మోడీతో కలిసి ట్రంప్ కూడా హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.  


మోడీతో పాటు ట్రంప్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అనే సరికి మరింత మంది ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది.  అసలు మోడీతో కలిసి ట్రంప్ ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్నారు.  కారణాలు ఏంటి అని ఆలోచిస్తే.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసమే ట్రంప్ హ్యూస్టన్ సభలో పాల్గొనబోతున్నారని కొందరు చెప్తున్నా.. అసలు వ్యూహం అదికాదని, ఆసియాలో ఇండియా బలమైన దేశంగా ఎదుగుతున్నది.  


ఇప్పటికే అనేక రంగాల్లో పరిణితి సాధించింది.  దౌత్యపరంగా ప్రపంచంలోని పార్టీ దేశంతో సంబంధబాంధవ్యాలు కలిగి ఉన్నది.  ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యలను మోడీ ప్రభుత్వం సులువుగా పరిష్కరిస్తోంది.  పైగా గత కొంతకాలంగా అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి.  అంతేకాదు హిందూ, పసిఫిక్ అంతర్జాతీయ జలాల్లో చైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నది.  అమెరికన్ మేధోసంపత్తిని చైనా అపహరించి సొమ్ము చేసుకుంటోంది. 


ఇది అమెరికాకు నచ్చడం లేదు.  ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు పాక్ కు నిధులు ఇస్తుంటే.. పాక్ చైనా మాటలకూ కట్టుబడి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.  ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో విధ్వంసం సృష్టించాలని చూస్తోంది.  అందుకే ఇండియాతో బలమైన మైత్రిని ఏర్పరుచుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తున్నది.  అమెరికాతో మైత్రిని ఏర్పరుచుకున్నా దాని ప్రభావం చైనాతో ఉండే మైత్రిపై పడకూడదు అని ఇండియా ఆలోచన.  దానికి తగ్గట్టుగానే ఇండియా స్పందిస్తుంది.  ఇండియా దౌత్యం ఉంటుంది.  అమెరికా కాశ్మీర్ విషయంలో పెద్దగా మాట్లాడలేకపోవడానికి కూడా ఇదే కారణం.  ఇండియా అమెరికా మధ్య సంబంధాలు బలపడుతుండటంతో.. పాక్ పాక్ నోట మాటరావడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: