ఒక్కోసారి సరదాకు చేసే పనుల వల్ల ప్రాణాలు పోతుంటాయి.అది ఏ విషయంలోనైన అవ్వనివ్వండి.కొంతమంది అతితెలివి పరులు ఒక్కోసారి చేసే ఎక్స్‌పర్మెంట్స్ వల్ల ఏం జరుగుతుందో చెప్పలేం.చివరకు పడక గదిలో చేసే ప్రయోగాలవల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చెప్పలేం.అయినా కాని కొందరు అవేమి పట్టించుకోకుండా తమ పని అయ్యిందా లేదా అని మాత్రమే చూస్తారు.అవి ఎంత ప్రమాదమో తెలిసి కూడా చేసే పనులతో పడరాని పాట్లు పడతారు.ఇలా ఒంట్లో పుట్టిన కోరికను తట్టుకోలేక శృంగారంలో స్వర్గాన్ని  చూద్దామని ప్రయత్నించిన ఈ ఇద్దరికి చేదు మిగిలింది.అందులో ఒక్కరి ప్రాణం పోయింది.ఆమె మరణించిందని తెలుసుకోలేనంతటి మోహంలో వున్న అతను పని ముగిసాక ఈ లోకంలో కొచ్చి చూస్తే ఆ ప్రియురాలు మరోలోకంలోకి వెళ్లింది.అతి అనేది ఎలాంటి అనర్ధాన్ని తెస్తుందో ఈ సంఘటనతో తెలుస్తుంది.



ఇక ఏం జరిగిందంటే స్పెయిన్ కు చెందిన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయిన ఫెలిక్స్ డాజా,సరదాగా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి షవర్ బాత్ సెక్స్చేస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కాని ఇంతలో ఓ ప్రమాదం జరిగి అతని ప్రియురాలు మాజియో మరణించింది. దీంతో ఫెలిక్స్ ను పోలీసులు హంతకుడిగా అనుమానించి అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళితే ఫెలిక్స్ తన స్నేహితురాలు మాజియో నివాసం ఉంటున్న ప్యూరిటో డెల్ రోసియో పట్టణానికి వెళ్లాడు. అక్కడే ఇద్దరు కలిసి శృంగారంలో మునిగి తేలాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కాస్త వెరైటీగా ఉండాలని బాత్రూమ్ లోకి వెళ్లి షవర్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు.ఇంతలో మాజియో కాలు జారడంతో హ్యాండ్ షవర్ పైప్ మెడకు బిగుసుకుంది.అయితే ఇద్దరూ మత్తు పదార్థాలు తీసుకోవడంతో ఫెలిక్స్ గుర్తించలేదు.ఇదంతా సెక్స్ గేమ్ లో భాగం అనుకొని ఒళ్లుమరచి ఆమెతో శృంగారంలో మునిగితేలాడు.



ఆ తర్వాత మాజియో ఎంతకీ స్పృహ నుంచి బయటకపోవడంతో ఫెలిక్స్ కు తన గర్ల్ ఫ్రెండ్ మరణించిందని తెలిసింది. దీంతో ఏమి ఎరుగని వాడిలా అక్కడి నుంచి ఫెలిక్స్ ఉడాయించాడు.అయితే ఉదయం స్థానికంగా ఉండే ఒకావిడ మాజియో ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఎంతగా పిలిచిన మాజియో పలుకక పోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్ చేయగా, పోలీసులు వచ్చి ఇంల్లంతా వెతికారు కాని ఆవిడ కనిపించకపోయేసరికి అనుమానంతో బాత్రూమ్ లో చూడగా నగ్నంగా పడివున్న మాజియో శవాన్ని చూసి నిర్ఘాంత పోయారు పోలీసులు.ఇక అక్కడ జరిగిన సంఘటన తాలుకూ ఆధారాలు సేకరిస్తుండగా,ఫెలిక్స్ మొబైల్ ఫోన్ అక్కడే దొరికింది.అలాగే మినీ ఐపాడ్,బెడ్ షీట్స్ మీద ఇద్దరు గడిపినట్లు క్లూలు దొరికాయి.దీంతో ఫెలిక్స్ ను అరెస్టు చేసి నిందితుడిపై మర్డర్ కేసు పెట్టారు.అయితే ఈ నేరం నిరూపితమైతే ఫెలిక్స్ కు 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి: