చంద్రయాన్ 2 ఉపగ్రహం 98% సక్సెస్ అయ్యింది.  ఈ విషయం అందరికి తెలిసిందే.  ల్యాండింగ్ సమయంలో తలెత్తిన చిన్న సాంకేతిక లోపం కారణంగా ల్యాండర్ విక్రమ్ సరిగా దిగలేకపోయింది.  ఇది వేరే విషయం అనుకోండి. ఈరోజు నుంచి చంద్రునిమీద ల్యూనార్ నైట్ ప్రారంభం అవుతుంది.  మరో 14 రోజులపాటు చీకటిగా ఉంటుంది.  కాబట్టి అక్కడ ఉష్ణగ్రత మైనస్ లో ఉండే అవకాశం ఉన్నది.  మైనస్ లో ఉండటం వలన విక్రమ్ ఫ్రీజింగ్ అవుతుంది.  

ఇప్పుడు విక్రమ్ కు సంబంధించిన సమాచారం రోదక్కపోవడంతో సమాచారం కోసం పరిశోధన చేస్తున్నారు.  ఒకవైపు విక్రమ్ సమాచారం కోసం పరిశోధన చేస్తూనే.. మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది ఇస్రో.  2020లో మరోసారి చంద్రునిమీదకు రాకెట్ ను పంపబోతున్నది.  అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానిపై అంచనాకు వచ్చారు కాబట్టి.. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇస్రో అడుగులు వేస్తున్నది.  


అలానే వచ్చే ఏడాది డిసెంబర్ లో మానవరహిత రాకెట్ ప్రయోగం చేయబోతున్నది.  దీనికి గగన్ యాన్ అనే పేరు పెట్టారు.  మానవరహిత రాకెట్ ప్రయోగం వచ్చే ఏడాది డిసెంబర్ ఒకసారి.. అలానే వచ్చే 2021లో జులైలో మరోసారి ఈ ప్రయోగం చేస్తుందట.  ఈ రెండు సక్సెస్ తరువాత 2021 డిసెంబర్ లో మనిషిని రోదసీలోకి పంపేందుకు ప్రయత్నం చేస్తున్నది.  గగన్ యాన్ కోసం ఇప్పటికే ఇస్రో సిద్ధం అయ్యింది.  


సాయుధ బలగాల నుంచి ఫ్లైయింగ్ అనుభవం ఉన్న వ్యక్తులను ఈ ప్రయోగం కోసం ఎంపిక చేస్తున్నది.  వీరికి ఇండియాలో కొంతకాలం శిక్షణ ఇస్తున్నది.  అలానే రష్యాలో కొన్ని రోజులు శిక్షణ పొందుతారట.  ఆ తరువాత ఇస్రో వారిని రోదసీలోకి పంపుతుంది.  ఈ ప్రయోగం విజయవంతమైతే.. రోదసీలోకి సొంతంగా మనిషిని పంపిన నాలుగో దేశంగా ఇండియా పేరు నిలబడుతుంది. దీంతో పాటు అంతరిక్షంలో ఇండియా సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకునే పనిలో కూడా ఉన్నది.  త్వరలోనే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: