తెలియకుంటే ఏదైనా ఖరీదే.. అన్ని చోట్ల మోసాలే.  ఇది నిజం.  ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి అనుకోని తెలుసుకొని ప్రయాణం చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది.  అలా కాకుండా తెలియకుండా ఆటోలో ప్రయాణం చేస్తే.. తడిసి మోపెడు అవుతుంది. అలాంటి సంఘటన ఒకటి పూణేలో జరిగింది.  బెంగళూరు నుంచి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పూణే వచ్చాడు.  పూణేలోని కాట్రాజ్ దేహు ప్రాంతం నుంచి ఎరవాడ వరకు వెళ్ళాలి.  మొత్తం దూరం 18 కిలోమీటర్లు. 


డెస్టినేషన్ కు చేరుకున్నాక బిల్లు రూ. 4300 వేశాడు.  దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.  ఏంటి ఇంత బిల్లా అని వాపోయాడు.  టోల్ గెట్ ఫీజు తో కలిసి వేశానని బుకాయించాడు.  నేను కట్టను అని చెప్తే.. ఆటోవాలాతో పాటు వచ్చిన మరో ఇద్దరు అతడిని తన్ని వాడిదగ్గర ఉన్న డబ్బులు వసూలు చేసుకొని వెళ్లారు.  అయితే, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆటో ఫోటో తీసి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  


18 కిలోమీటర్లకు 4300 వసూలు చేశారని చెప్పేసారు షాక్ అయ్యారు.   చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఇప్పుడు ఆ ఆటోవాలా చిక్కితే పాపం జీవితంపోయినట్టే.  చక్కగా ఆటో నడుపుకుంటూ రోజు సంపాదించుకోక ఇలా దందా చేసి వసూళ్లు చేస్తే ఇలానే ఉంటుంది.  ఒక్క పూణే ముంబైలోనే కాదు.  చాలా చోట్ల ఇలాంటి దందాలు జరుగుతూనే ఉన్నాయి.  ఈ దందా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  


ఎవరిపని వారు చేసుకుంటూ.. హ్యాపీగా వర్క్ చేసుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఎవరికీ ఎటువంటి కష్టాలు రావు.. నష్టాలు ఉండవు.  కానీ, అనవసరంగా అతిగా ఆలోచించి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అంటే ఇలానే ఉంటుంది.  డబ్బులు అవసరం అనుకుంటే ఎక్కువగా పని చేయాలి.  ఎక్కువ కష్టపడానికి.. అప్పుడే డబ్బులు వస్తాయి తప్పించి.. ఇలా తప్పుదారిలో నడిస్తే మాత్రం తప్పుగానే ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: