ఏపీ జగన్ సీఎం పోలవరం టెండర్ల విషయంలో రీ టెండరింగ్ కు వెళ్లారు.. ఓ 58 కోట్లు ఆదా చేశామంటున్నారు.. కానీ ఈ క్రెడిట్ జగన్ సర్కారుకు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా లేదు. అందుకే ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ పనులు లేటు కావడానికి జగన్ తండ్రి వైఎస్ కారణమంట.. అందువల్ల దాదాపు 158 కోట్ల నష్టం వచ్చిందట.. 158 కోట్లు నష్టం చేసి.. కేవలం 58 కోట్లు ఇప్పుడు లాభం చేసి.. ఏదో గొప్ప చేశారంటున్నారా అంటూ లాజిక్కు లాగాడు దేవినేని ఉమా మహేశ్వరరావు.


రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో చేసిన ధనయజ్ఞాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ పునరావృతం చేశారని దేవినేని ఉమా మహేశ్వరరావు అంటున్నారు. 2005లో కూడా పోలవరం ఎడమ కాల్వ 65వ ప్యాకేజీ టన్నల్ టెండర్లు 21శాతం తక్కువ కు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అప్పుడు వీటిని యూనిటీ ఇన్ఫ్రా సంస్థకు 2005లో 115 కోట్లకు దక్కించుకొని 15శాతం మట్టిపనులు చేసి ఆ సంస్థ మధ్యలో వెళ్ళిపోవటంతో 14ఏళ్ళు పనులు ఆగిపోయాయట.


దానికే తన ప్రభుత్వ 274కోట్ల కు టెండర్లు పిలిస్తే మ్యాక్స్ ఇన్ఫ్రా వీటిని 290కోట్లకు దక్కించుకుందంటున్నారు. దానిని ఇప్పుడు రివర్స్ చేసి 232కోట్లు కు మళ్లీ మ్యాక్స్ ఇన్ఫ్రా కు అప్పగించారని ఉమా వెల్లడించారు. మొత్తంగా వైఎస్ హయాంలో జరిగిన ధనయజ్ఞం వల్ల 157కోట్లు నష్టం చేసి ఇప్పుడు 58కోట్లు ఆదా చేసామంటూ ప్రభుత్వం బడాయి కబుర్లు చెప్తుందంటూ ఉమా మండిపడ్డారు.


115 కోట్ల రూపాయల పని వైఎస్ హయాంలో జగన్ అవినీతి వల్లే అదనంగా 157కోట్లుకు పెరిగిందని దుయ్యబట్టారు. నష్టపోయిన 157కోట్లకు ఎవరు బాధ్యత వహిస్తారని డిమాండ్ చేస్తున్నారు. పవర్ ప్రాజెక్టు పనులను ఆపేయడం వల్ల దాదాపు 1000 కోట్లు జగన్ నష్టం చేయబోతున్నారని ఉమా కొత్త లెక్కలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: