అతనొక ఉపాధ్యాయుడు. అయితే తన భూమిని ఓ రాజకీయంగా పలుకుబడిన నాయకుడు కబ్జా చేశాడు. ఈ రోజుల్లో ఎవరితోనైనా పోరాటం సాగించాలంటే రాజకీయంగా కానీ, ఆర్థికంగా బలంగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఎదుటి వ్యక్తిపై నెగ్గగలము. అలా మారిపోయింది ఈ రోజుల్లో. ఎక్కువగా రాజకీయ నాయకులతో పెట్టుకుంటే వారి పలుకుబడిని ఉపయోగించి ఎదుటి వ్యక్తికి ఏమాత్రం జంకరు. అలాంటి రాజకీయ నాయకుడికి ఈ వ్యక్తికి చిక్కిపోయాడు. దేశంలో సామాన్యులకు అన్యాయం జరుగకుండా న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికే అధికారులకు ఇదో ఉదాహారణ.

 

ఓ ఉపాధ్యాయుడు భూవివాదంలో తనకు అన్యాయం జరిగిందని, తనకు న్యాయం  చేయాలని కాళ్ల చెప్పులరిగేలా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఉత్తర  ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ కు చెందిన విజయ్ సింగ్ అనే ఉపాద్యాయుడికి కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిని రాజకీయ నాయకుడు ఒకరు కబ్జా చేశాడు. ఈ విషయమై 23 సంవత్సరాల నుంచి తనకు న్యాయం జరగాలని, ఆ బ్యాక్తి కబ్జా కొరల్లో ఉన్న భూమిని తనకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తహసీల్, ఆర్డీవో  ఇలా తదితర ప్రభుత్వ  కార్యాలయాలల్లో కూడా ఫిర్యాదు చేశాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కబ్జా చేసిన వ్యక్తి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఈ ఉపాధ్యాయుడు అతన్ని ఏమి  చేయలేకపోయాడు. అంతేకాదు…పైగా ఆ వ్యక్తిని ఈ రాజకీయ నాయకుడు ఫోన్ లో బెదిరిస్తున్నాడని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఉపాధ్యాయుడు. అయితే ఈ  ఉపాధ్యాయుడి విషయంలో ఏ అధికారి స్పందించకపోవడంతో చివరి ప్రయత్నంగా ఓ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టాడు. ఏకంగా కలెక్టర్ కార్యాలయం ముందు స్నానం చేసి తన లోదుస్తులు ఉతికి అక్కడే ఆరవేశాడు. తన అండర్ వేర్ ను ఉతికి అక్కడే ఆరేసి నిరసన వ్యక్తం చేశాడు.

 

అయితే తన భూమి విషయమై ఫిర్యాదు చేస్తే….పోలీసులు, అధికారులను మేనేజ్ చేసి దానిపై ఎలాంటి విచారణ జరగకుండా అడ్డుకున్నాడని బాధితుడు ఆరోపించాడు. సుమారు 23ఏళ్ల నుంచి తన న్యాయం కోసం చెప్పులరిగేలా పోలీసు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా…అయినా ఎలాంటి లాభం లేకపోయింది అంటూ విజయ్‌సింగ్ మీడియా ముందు వాపోయాడు. అందుకే ముజఫర్‌పూర్ కలెక్టర్ కార్యాలయం ముందే ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి పూనుకొన్నట్లు చెప్పుకొచ్చాడు.

 

అయితే ఈ ఘటన పెద్ద దుమారమే లేపింది. కలెక్టరేట్ ఇన్‌ఛార్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో విజయ్ సింగ్ తన నిరసనను విరమించాడు. మరి ఇలా 23 ఏళ్ల తర్వాత మేలుకొన్న అధికారులు ఇతనికి ఏ విధంగా న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: