ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు.అసలు ఉల్లి లేనిదే వంటలకు రుచి తగలడం కష్టం.దాదాపు అన్ని రకాల కూరగాయల్లోనే గాక,ఇతర వంటల్లో ఉల్లి వినియోగించాల్సిందే. కాబట్టే ఉల్లికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది.అయితే ఉల్లి పంట సరిపడినంత పండినంత కాలం ఇబ్బంది ఉండదు.ఇక ఉల్లి మేలు సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ ఉల్లి అత్తారింటికి వెళ్లే కొత్త కోడల్లా కన్నీరు పెట్టిస్తుంది.మొన్నటివరకు అందుబాటులో ఉన్న ఉల్లి రెట్లు గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా సామాన్య ప్రజల చేతికి అందకుండా,నోటికి దూరమౌతుంది.



ఇక ఇప్పట్లో నేను తగ్గనంటూ రోజురోజుకు ఉల్లి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దీంతో ప్రజలు ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడుతునారు.మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లి గడ్డ ధర కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు పలుకుతోంది.దీంతో భగ్గుమంటున్న ధరలను చూసి వినియోగదారులు ఉల్లిపాయలను కొనాలన్న,కొని తినాలన్నా,భయ పడుతున్నారు.కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు కొందరు.ఇంతకు ఈ రాష్ట్రాలకు ఏమైంది.ఓ వైపు ఉల్లిధరలు,పెట్రోల్ ధరలు,బంగారం ధరలు,నిత్యావసరాల ధరలు,మరో వైపు ప్రకృతి వైపరిత్యాలు.ఇదేనా సామాన్యుడు కోరుకుంది.ఇలాగే పరిస్దితులు కొనసాగితే ముందు ముందు కడుపునిండా తిని బ్రతడానికి ఎన్ని కష్టాలు,మరెన్ని అవరోధాలు ఎదుర్కొన వలసి వస్తుందోనని జనం భయపడుతున్నారు.



మరోవైపు ఈ వర్షాలే ఉల్లి ధరలు మండిపోవడానికి కారణమంటున్నారు వ్యాపారులు.వర్షాల కారణంగా మార్కెట్‌కు ఉల్లిపాయల రాక తగ్గిపోయిందని, క్వింటాలు ఉల్లిపాయలు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.
ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఉల్లిపాయల సరఫరా మరింత కష్టంగా మారే అవకాశముందని చెప్తున్నారు. మరోవైపు ఉల్లి రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గత రెండేళ్ల నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.ఇక మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిసాగు తగ్గిపోయింది దీంతో దిగుమతి కూడ అనుకున్నంతంగా జరగక పోవడంతో రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి,ధరలు ఆకాశానికెక్కుతున్నాయి.ఇక ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమైన స్పందిస్తాయో లేవోనని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రజలు..  


మరింత సమాచారం తెలుసుకోండి: