ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చంద్రయాన్ -2 చంద్రుని ఉపరితలం మీద దిగే ప్రయత్నంలో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తలెత్తిన సంగతి విధితమే. ఈ నేపధ్యంలో విక్రం ల్యాండర్ ఎక్కడ ఉన్నది ఆచూకి కనుగొనడంలో అటు ఇస్రో ఇటు నాసా పూర్తిగా సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో విక్రం ల్యాండర్ నుంచి సంకేతాలను పునరుధ్ధరించడంలో మాత్రం చేసిన ప్రయత్నాలు అలాగే ఉండిపోయాయి.


దీనికి పద్నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో నాసా, ఇస్రో కలసి చేసిన అతి పెద్ద ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో విక్రం ల్యాండర్ ఇక టాటా చెప్పేసినట్లేనని అంటున్నారు. దీని మీద ఇస్రో చైర్మన్ కె శివన్ మాట్లాడుతూ, చంద్రయాన్ ప్రయోగం 98 శాతం పైగా సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. 


దాంట్లోని ల్యాండర్, రోవర్లు మొరాయించినప్పటికీ ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోందని  చెప్పారు. 2020లో మరోసారి జాబిల్లి యాత్ర చేపట్టనున్నట్లుగా  శివన్ తెలియచేశారు.  భవిష్యత్తు ప్రణాళిక‌లపైన చర్చలు సాగుతున్నాయని ఆయన  వెల్లడించారు. ఇదిలా ఉండగా జాబిల్లిపై యాత్రకు సంబంధించిన  కార్యక్రమాలపైన ఇస్రో ప్రస్తుతం  ద్రుష్టి సారించిందని అన్నారు.


ఇక అటు విక్రం ల్యాండర్ వైఫల్యం 2021లో చేపట్టబోయే గగనయాన్ పైన అసలు  ఉండదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా విక్రం ల్యాండర్ పూర్తిగా చంద్రుని ప్రతికూల ప్రభావ పరిస్థితుల్లో చిక్కుకోవడం వల్లనే సిగ్నలింగ్ వ్యవస్థ‌ను ఇస్రో పునరుద్ధరించలేకపోయిందని అంటున్నారు. అయితే ఆర్బిటర్ చక్కగా పనిచేయడంతో చాంద్రయాన్ -2 ప్రయోగం పూర్తిగా విజయవంతం అయినట్లేనని కూడా ఇస్రో సైంటిస్టులు అంటున్నారు. ఈ విషయంలో ఇస్రో తన మరిన్ని జాగత్తలతో గగనయాన్ కి సిధ్ధమవుతూండడం కూడా ఆసక్తిని కలిగించే పరిణామంగానే చూడాలి. సో అల్ ది బెస్ట్ ఇస్రో అని మరో సారి చెప్పాల్సిందే. 




మరింత సమాచారం తెలుసుకోండి: