హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఈ బిర్యానీకి ఎంతో మంచి పేరు ఉంది. కానీ కొందరు చేస్తున్న పనుల వలన ఆ గుర్తింపు, పేరు చెడిపోతుంది. కల్తీ నూనెలను వినియోగించి కుళ్లిన చికెన్, మటన్ తో హోటళ్లలో బిర్యానీ తయారు చేస్తూ ఉండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా హోటళ్లలో ఇదే పరిస్థితి ఉందని సమాచారం. మల్కాజ్ గిరిలోని ఒక హోటల్ లో కొన్ని రోజుల క్రితం కుళ్లిన మాంసం ఉపయోగిస్తున్నారని బయటపడింది. 
 
హైదరాబాద్ నగరంలోని యువత, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా హోటళ్లలోని ఆహారంపైనే ఆధారపడుతున్నారు. నగరంలోని చాలా మంది రోజులో ఏదో ఒక సమయంలో బయట ఆహారం తింటున్నారు. హైదరాబాద్ నగరంలో హోటల్ వ్యాపారంపై ఆధారపడి ఎందరో జీవనం సాగిస్తున్నారు. కానీ ఆహారం తయారీ విషయంలో శుచి, శుభ్రత పాటిస్తున్నారా, కల్తీ లేని వాటినే ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే హోటళ్లలో తినే ధైర్యం చేయరని చెబుతున్నారు వైద్యులు. 
 
అన్ని హోటళ్లు ఇలానే ఉంటాయని కాదు కానీ చాలా హోటళ్లలో మాత్రం ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కొన్ని హోటళ్లు వారం రోజులకు పైగా నిల్వ ఉన్న మాంసాన్ని వినియోగిస్తున్నారని సమాచారం. మల్కాజ్ గిరి ప్రాంతంలో మంచి పేరు ఉన్న ఒక హోటల్ లో తనిఖీలకు వెళ్లిన అధికారులకు బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం నుండి కుళ్లిన వాసన వస్తూ ఉండటంతో ఆ అధికారికి వాంతికి వచ్చిందని తెలుస్తుంది. 
 
పెద్ద పెద్ద హోటళ్లలో, రెస్టారెంట్లలో విక్రయించే ఆహారంలో కూడా ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని సమాచారం. కొన్ని హోటళ్లలో రుచి కోసం రసాయనాలతో కూడిన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు. రసాయనాలతో కూడిన ఆహారం తీసుకుంటే కేన్సర్, అల్సర్, ఊబకాయం, జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: