ప్రయాణీకులను ఆకర్షించేందుకు రైళ్లకు సరికొత్త రూపాన్ని కల్పించారు. ఇప్పటిదాక రైళ్లన్నీ లేత నీలం రంగులో కనిపించేవి.  అలాంటిది తాజాగా ముదురు గులాబీ వర్ణంలో మెరిసిపోతున్నాయి. అంతేగాకుండా కొన్ని అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. భద్రమైన, చవకైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నఈ ఎంఎంటీఎస్ లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల ఆదరణ పొందుతోంది. ఇదే స్ఫూర్తితో  2019 అక్టోబర్ నాటికి ఎంఎంటీఎస్ రెండో దశ మొదటి భాగాన్ని పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు.



వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ సేవలు ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా 
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కొంత మేర అసౌకర్యం ఏర్పడనుంది. అది కూడా  కేవలం ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టునట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా ఎంఎంటిఎస్ రైళ్లల్లో ప్రయాణించేవారికీ ఎపి హెరాల్డ్ చేస్తున్న చిన్న సూచన మాత్రమే..నిత్యం ఎంఎంటీఎస్ రైళ్ళ‌తో ప్ర‌యాణం చేసే న‌గ‌ర‌జీవుల‌కు నిజంగా ఇది చేదువార్తే అయినప్పటికి అప్పుడ‌ప్పుడు ఇవి త‌ప్ప‌వు.. అయితే మీరు గుండెరాయి చేసుకుని ఈ వార్త వినాల్సిందే.




 మీరు తరుచుగా  రైళ్లను ఉపయోగిస్తుంటారా.. అందులోను ఎంఎంటిఎస్  రైళ్లో వెళ్ళుతుండేవాళ్లు   గమనించతగ్గ అంశం ఏంటంటే .సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఫలక్ నుమా - లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్ నుమా - సికింద్రాబాద్ వరకు పరిమితమవుతాయని వెల్లడించారు. అలాగే నాంపల్లి - ఫలక్ నుమా సర్వీసులు సికింద్రాబాద్ - ఫలక్ నుమా మధ్య రద్దు కానున్నట్లు తెలిపారు. కేవలం ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: