వైఎస్ జగన్ మానసపుత్రికలుగా పేర్కొంటున్న పధకాలకు ఇపుడు దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. భారీ లోటు బడ్జెట్లో ఉన్న ఏపీలో అనేక పధకాలకు జగన్ ఎలా శ్రీకారం చుడుతున్నారన్నది పెద్ద చర్చగా ఉంది. జగన్ విషయంలో పధకాలే ఇపుడు పెద్ద ప్లస్ పాయింట్ గా ఉన్నాయి. అభివ్రుధ్ధి ఓ వైపు చేస్తూనే తాను చెప్పిన నవరత్నాల్లాంటి పధకాలను జనంలోకి  తీసుకుపోవాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.


ఇదిలా ఉండగా జగన్ పధకాలైన అమ్మఒడి, వైఎస్సార్ రైతు భరోసా వంటి వాటిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ పధకాలను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం ద్వారా వాటికి మరింత ప్రాచుర్యం తీసుకురావడమే కాకుండా వాటి అమలుపైన జనంలో సానుకూల అభిప్రాయం ఏర్పరచలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో జరుగుతున్న అభివ్రుధ్ధి, సంక్షేమం  గురించి దేశమంతటా మాట్లాడుకునే విధంగా కూడా ఉంటుందని ప్రధని మోడీని జగన్ ఏపీకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.


ఇక తాను చేపడుతున్న పధకాలకు అయ్యే ఖర్చుని కూడా భారీ ఎత్తున కేంద్రం నుంచి  ఆర్దిక సహాయం పొందడం ద్వారా  కష్టాలను అధిగమించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి పధకం ఖర్చును కేంద్ర మానవ వనరుల శాఖ భరించాలని జగన్ కోరారు. ఇపుడు ప్రధాని నేరుగా ఏపీకి వస్తే ఆ పధకాల గురించి, వాటి ఫలితాల గురించి కూడా బాగా  వివరించి పెద్ద ఎత్తున నిధులను రాబట్టాలని కూడా జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక వైసీపీకి, బీజేపీకి మధ్య విభేధాలు ఉన్నాయని భావించేవారికి కూడా ప్రధానిని ఏపీకి రప్పించడం ద్వారా సరైన సమాధానం చెప్పి రాజకీయంగా మరింత బలోపేతం కావాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మోడీ ఎలాంటి వరాలు కురిపిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: