పోలవరం ప్రధాన డ్యాం,  హైడల్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన రివర్స్ టెండరింగ్  గడువు శనివారం సాయంత్రం తో ముగిసింది .  అయితే గడువు ముగిసే సమయానికి ఒకే ఒక కాంట్రాక్ట్  సంస్థ బిడ్ దాఖలు   చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకే ఒక కాంట్రాక్ట్  సంస్థ బిడ్ దాఖలు చేయడంతో, ఇప్పుడు  జలవనరుల శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా   ఉత్కంఠ  నెలకొంది . ఒకే ఒక బిడ్ దాఖలు చేసిన సంస్థకే కాంట్రాక్ట్ పనులు కట్టబెడుతుందా?, లేకపోతే మళ్ళీ టెండర్లను ఆహ్వానిస్తోందా?? అన్నది తేలాల్సి ఉంది .


 పోలవరం ప్రధాన డ్యామ్,  హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు గత ప్రభుత్వం  టెండర్లు ఆహ్వానించగా… అవినీతి జరిగిందంటూ,  జగన్ సర్కార్ టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రెండు పనులను గతంలో నవయుగ సంస్థ చేపట్టగా,  జగన్ సర్కార్  ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని  ఏర్పాటు చేసి, కమిటీ ఇచ్చిన  నివేదిక మేరకు నవయుగ సంస్థను కాంట్రాక్ట్ పనుల నుంచి  తపిస్తూ,  ఒప్పందాన్ని రద్దు చేసింది .  ప్రభుత్వ నిర్ణయం పై నవయుగ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయినా జగన్ సర్కార్ అదేమీ పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది .


రివర్స్ టెండరింగ్ పై  బుధవారం నిర్వహించిన ఫ్రీ బిట్ సమావేశానికి దాదాపు ఎనిమిది నిర్మాణ సంస్థలు హాజరైనప్పటికీ, ఒక్క మేఘా నిర్మాణ సంస్థ మాత్రమే  బిడ్ దాఖలు చేసి , బ్యాంక్ గ్యారంటీకి సంబంధించిన పత్రాలను అధికారులకు సమర్పించింది . దీనితో ఆ సంస్థకే పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజక్ట్ నిర్మాణ పనులు  దక్కడం ఖాయమన్న   వాదనలు విపిస్తున్నాయి . పోలవరం ఎడమ కాలువ పనులను మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ దక్కించుకున్న విషయం తెల్సిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: