బ్రిటన్ లోని యూగౌ అనే సంస్థ మగవాళ్ల గురించి చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో ఆడవాళ్లతో పోలిస్తే మగవారు ఎక్కువగా ఒంటరితనంతో బాధ పడుతున్నారని తెలిసింది. ఈ సర్వేలో 24 శాతం మంది మహిళలు మంచి మిత్రులు లేరని,12 శాతం మంది మహిళల్లో సన్నిహిత మిత్రులు లేరని, 32 శాతం మంది మంచి మిత్రులే లేరని, 18 శాతం మంది సన్నిహిత మిత్రులు ఒక్కరు కూడా లేరని చెప్పారని సమాచారం. 
 
సాధారణంగా పెళ్లైన మహిళలు పిల్లలతో కలిసి మైదానానికి వెళ్లినపుడు, స్కూళ్లకు వెళ్లినపుడు ఇతర పిల్లల తల్లులు పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మగవారు పిల్లలతో కలిసి వెళ్లటానికి ఎక్కువగా ఇష్టపడరు. కేవలం ఆఫీసులోని వ్యక్తులతో మాత్రమే స్నేహం చేస్తారు. అందువలన పురుషులు ఎక్కువగా ఒంటరితనంతో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ సర్వే ప్రకారం పురుషులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా తక్కువగా ఉంటారని, కొత్తవారితో స్నేహం చేయటం పట్ల పురుషులు ఎక్కువగా ఆసక్తి చూపించరని మహిళలు మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఉంటారని తేలింది. మహిళలు వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవటానికి ఇష్టం చూపుతారని పురుషులు మాత్రం ఒంటరితనంతో బాధ పడుతున్నా ఆ విషయాన్ని పంచుకోవటానికి కూడా ఇష్టపడరని సర్వేలో తేలింది. 
 
కేవలం 18 శాతం మంది పురుషులు మాత్రమే కొత్తవారితో స్నేహం చేయాలనే ఉత్సాహంతో ఉంటారని తెలిసింది. ఒంటరితనం వలన జీవితంపై పెద్దగా ఆసక్తి ఉండదు. కొంతమంది ఒంటరితనం వలన ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఒంటరితనంతో ఎవరైనా బాధ పడుతూ ఉంటే పాత స్నేహితులతో స్నేహం మరలా పునరుద్ధరించుకోవటం, సోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులతో పరిచయం పెంచుకోవటం, ఇరుగు పొరుగు వారితో స్నేహం పెంచుకోవటానికి ప్రయత్నించటం మంచిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: