రఘువీర్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ శివారులోని ఒక పల్లెటూరులో జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. చిన్నప్పటినుండీ రఘువీర్ కు చదువంటే ఎంతో ఇష్టం కానీ ఆర్థికపరమైన సమస్యల వలన రఘువీర్ పదవ తరగతితోనే చదువు ఆపేశాడు. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉన్నా పేదరికం వలన రఘువీర్ చదువుకు దూరమయ్యాడు. చదువు మానేసిన తరువాత రఘువీర్ కూలి పనులకు వెళ్లేవాడు. 
 
అప్పటేకే రఘువీర్ తండ్రి ఆరోగ్యం పాడైంది. కూలి పనుల ద్వారా సరిగ్గా సంపాదన రావటం లేదని భావించిన రఘువీర్ చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుదామని అనుకున్నాడు. స్నేహితుడి సలహాతో జైపూర్ కు వెళ్లి స్నేహితుని గదిలోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. రఘువీర్ కు అమెజాన్ కంపెనీలో డెలివరీ బాయ్ ఉద్యోగం నెలకు 9 వేల రూపాయల జీతంతో వచ్చింది. బైక్ లేకపోవటంతో సైకిల్ పై వెళ్లి డెలివరీ చేసేవాడు రఘువీర్. 
 
రఘువీర్ డెలివరీ ఇవ్వటానికి వెళ్లిన సమయంలో కొందరు టీ, స్నాక్స్ తెచ్చిపెట్టమని రఘు వీర్ ను అడిగేవారు. రఘువీర్ ఉద్యోగం మానేసి టీ, స్నాక్స్ డెలివరీ చేయాలని ఆలోచించాడు. స్నేహితులకు ఇదే విషయం చెప్పగా ఈ ఐడియా వర్కవుట్ కాదని స్నేహితులు రఘువీర్ ను తిట్టారు. కానీ రఘువీర్ శుచి, రుచితో కూడిన టీ, స్నాక్స్ ఇచ్చే దుకాణాల్ని వెతికి మొదట కొందరికి ఉచితంగా ఇచ్చాడు. 
 
ఇరవై వేల రూపాయల పెట్టుబడితో టీ హోం డెలివరీ ప్రారంభించాడు. ఆర్డర్లు రోజుకు 100కు పైగా పెరగటంతో టీ చేయటం నేర్చుకొని సొంత దుకాణం పెట్టాడు. రద్దీగా ఉండే మూడు ప్రాంతాలలో టీ స్టాళ్లను ఏర్పాటు చేసి రోజుకు 800 ఆర్డర్ల స్థాయికి చేరుకున్నాడు. ఆర్డర్లు పెరగటంతో ఆరుగురు డెలివరీ బాయ్స్, పది మంది సహాయకులను రఘువీర్ నియమించుకున్నాడు. ప్రస్తుతం రఘువీర్ నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులను కూలి పనుల నుండి మాన్పించి ఇల్లు కట్టించి తన చెల్లిని, తమ్ముడిని చదివిస్తున్నాడు రఘువీర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: