ప్రతివారు స్వంత ఇంట్లో ఉండాలని అనుకుంటారు.అందుకోసం ఎంతగానో శ్రమిస్తారు.ఎన్నో కలలు కంటారు.అలాంటి స్వంత ఇల్లు హైదరాబాద్‌లో వుంటే మరీ మంచిది అని ఆలోచించి ఎక్కడైన వారికి అనుకూలమైన ధరలో వస్తే తీసుకోవడానికి వెనకడుగు వేయరు.ఇలాంటి వారి బలహీనతను ఆసరగా చేసుకుని కొంతమంది అక్రమ లేఅవుట్లు కలిగిన ఫ్లాట్స్‌ను అంటగడుతున్నారు.మీరు కన్న స్వంత ఇల్లు కావాలనే కల మంచిదే కాని తీసుకునే ఫ్లాటు ఎలాంటిది, అసలు అక్కడ కొనవచ్చా లేదా.ఫ్లాటు అమ్మేవాడు సరైన వాడేనా,కాదా ఇవన్ని ఆలోచించి తీసుకోవాలి.తక్కువ రేటుకు వస్తున్నాయని ఎగబడితే చివరకు ఇల్లు కాదు కన్నీళ్లు మిగులుతాయి.. 



ఇలా చాల మందికి అనుభవమైన విషయమే.కాని ఆశ,మనిషిలోని మనసును ఊరుకోనీయదు కదా! ఎప్పుడు తొందర పెడుతు వుంటుంది..ఇక విషయమేంటంటే ఇప్పుడు చెప్పే ప్రదేశంలో అసలు ఫ్లాట్ తీసుకోకండని సాక్షాత్తు కమీషనర్ చెబుతున్నారు. కాదని వినకుండా తీసుకుంటే జరిగే నష్టానికి బాధ్యులు తాము మాత్రం కాదని అది మీరే ఆవుతారని చెబుతున్నారు.ఇంతకు నమ్మించి నష్టం చేసే ఆ ముదనష్టపు ఫ్లాట్స్ ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం.నగరంలోని చందానగర్‌ సర్కిల్‌ ఖానామెట్‌ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు,ప్లాట్లను కొనుగోలు చేయొద్దని చందానగర్‌ డిప్యూటీ కమిషనర్‌ యాదగిరిరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 





హాఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 78 గోకుల్‌ ప్లాట్లలో అక్రమ నిర్మాణాలుగా గుర్తించి,గతంలో కూల్చివేశామని,ఇప్పుడు తిరిగి కూల్చి వేసిన 91 నిర్మాణాలను కడుతున్నారని, వాటికి విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లు ఇవ్వొద్దంటూ విద్యుత్‌శాఖను కోరామని తెలిపారు. అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకున్నా వాటిని తొలగిస్తామన్నారు.చందానగర్‌ సర్కిల్‌ ఖానామెట్‌ అయ్యప్ప సొసైటీలోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ తిరిగి 17 ప్లాట్లలో అక్రమంగా అపార్ట్‌మెంట్లను నిర్మిస్తూ వాటిని తిరిగి విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వాటిని కనుగోలు చేసిన వారు తర్వాత పడరాని పాట్లు పడవలసి వస్తుందని హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: