ఇటీవల  కబ్జాలు ఎక్కువయ్యాయి.  చిన్న స్థలం ఎక్కడ దొరికినా దాన్ని కబ్జా చేస్తున్నారు.  కబ్జా చేసిన తరువాత తనకంటే తోపు అనుకుంటే దాన్ని వదిలేస్తారు.. లేదు అది ఏ చిన్న వ్యక్తితో, సామాన్య వ్యక్తితో అయితేమాత్రం దాన్ని విచిచిపెట్టకుండా కబ్జా చేస్తారు.  ఆ స్థలం కోసం సదరు వ్యక్తి అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగాల్సిందే.  ఎన్నిసార్లు తిరిగినా లాభం ఉండదు.  ఎందుకంటే.. అక్కడ వాళ్లకు పవర్ ఉంటుంది.  


ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్తే చాలు.. పాపం ఆ వ్యక్తి ఎంత తిరిగినా ఉపయోగం ఉండదు. తిరిగి తిరిగి తన స్థలాన్ని వదిలేసుకోవాల్సిందే.  అంతకు మించి మరో విషయం ఉండదు.  అయితే, ఈ వ్యక్తి మాత్రం కబ్జాకు గురైన తన స్థలం గురించి మాములు పోరాటం చేయలేదు.  తన పోరాటం ఫలించకపోవడంతో వెరైటీగా అప్రోచ్ అయ్యాడు.  దీంతో పోలీసులు దిగి వచ్చారు.  


అసలేం జరిగింది.. ఎవరు ఎందుకు ఎలా పోరాటం చేశారో తెలుసుకుందాం.  ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ కు చెందిన విజయ్ కుమార్ అనే ఉపాద్యాయుడికి ఓ స్థలం ఉన్నది.  దాన్ని స్థానిక నాయకుడు ఒకరు కబ్జా చేశారు.  కబ్జా చేయడంతో గత 23 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు.  ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది.  ఎవరూ పట్టించుకోలేదు.  పట్టించుకోకపోవడమే .. పదేపదే కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  


దాంతో విజయ్ కుమార్ విసుగు చెందాడు.  ఎలాగైనా సరే తన పోరాటం ఆపకూడదని నిర్ణయం తీసుకున్న విజయ్ కుమార్... స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి అక్కడ స్నానం చేశారు.  అక్కడితో ఆగకుండా తన లో దుస్తులను ఆరేశారు.  అది చూసిన కలెక్టర్  పోలీసులను పిలిపించి ఆ పని చూడమన్నారు.  పోలీసులు వెళ్లి విజయ్ కుమార్ చేసిన పని గురించిఅడిగితె ... పోలీసులకు ఏం చెప్పాలో అర్ధంగాక సైలెంట్ గా ఉన్నారు.  కాగా, చివరకు పోలీసులు ఈ విషయాన్ని కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా ఆయన హామీ ఇవ్వడంతో విజయ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.  మరి కలెక్టర్ చొరవతో అయినా తిరిగి అతని భూమి అతనికి వస్తుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: