తెలంగాణ లో రానున్న రోజుల్లో తెరాస కి బీజేపీ నే ప్రత్యామ్నాయమని... బీజేపీ వచ్చే  ఎన్నికల్లో తప్పకుండ అధికారంలోకి వస్తుందని బీజేపీ చెబుతుంది. దీనికోసం ఇప్పటినుండే పావులు కదువుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటు ముందుకు సాగుతుంది బీజేపీ. అయితే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాడు. బీజేపీ నాయకులు ప్రతి సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రగల్బాలు పలుకుతున్నారని... కొత్తగా మతం పుచుకున్నోడికి నామాలు ఎక్కువ అన్న చందంగా బీజేపీ మాటలు  ఉన్నాయని కేసీఆర్ ఎద్దేవా చేసారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చీకటి రోజుగా మాట్లాడుతున్నా అమిత్ షా... తల్లిని చంపి బిడ్డని బ్రతికించారని తెలంగాణ గురుంచి మాట్లాడుతున్నా మోడీ...ఇద్దరు ఆ  మాటలని బంద్ చేయాలనీ కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఆత్మ గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... బీజేపీ తమకు కొత్తగా తెలంగాణ ఆత్మ గౌరవం గురుంచి చెప్పాల్సిన పనిలేదన్నారు. 

 

 

తెలంగాణలో  అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి కేంద్రంలో అమలు చేస్తుందని... అలాంటి కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏంటని ప్రశ్నించారు. రైతు బందు పథకాన్ని కిసాన్ సమ్మాన్ యోజనగా ... ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆయుష్మాన్ భవగా ... ఇలా అన్ని తెలంగాణ  పథకాలకు పేరు మార్చి తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అని... ఈ రెండు పార్టీ ల వల్లే దేశంలో తీవ్ర ఆర్ధిక మాంద్యం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ ల వల్లే దేశంలో పేదరికం ఎక్కువయ్యిందని ఫైర్ అయ్యారు. ఒకవేళ బీజేపీ గనుక తెలంగాణాలో అధికారంలోకి రాష్ట్రం పరిస్థితి ఆగం ఆగం అవుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: