ఇప్పుడు యుఎస్ లో ఎక్కడ చూసినా ఒకే మాట.. నమో మంత్రంతో యూఎస్ నిండిపోయింది.  మరికాసేపట్లో హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో హౌడీమోడీ ప్రారంభం కాబోతున్నది.  కార్యక్రమంలో 50వేలమంది అమెరికన్ భారతీయులు పాల్గొనబోతున్నారు.  ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.  భారతీయ కాలమానం ప్రకారం మరో అరగంటలో కార్యక్రమం మొదలుకాబోతున్నది.  ఈ వేడుకల్లో ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు.  


మోడీ ట్రంప్ తో పాటుగా అమెరికన్ కాంగ్రస్ సెనేటర్లు పాల్గొంటున్నారు. కాగా, అమెరికా పర్యటన కోసం హ్యూస్టన్ లో మోడీ దిగిన తరువాత అక్కడ ఓ అద్భుతమైన సంఘటన జరిగింది.  హ్యూస్టన్ లో అడుగు పెట్టిన తరువాత మోడీకి స్వాగతం పలికేందుకు అధికారులు అక్కడికి వచ్చారు.  అలా వచ్చిన ఇండియన్, అమెరికన్ అధికారులు.. మోడీకి పుష్పగుచ్ఛం అందించారు.  


అదే సమయంలో ఆ పుష్పగుచ్ఛంలోని పూలు కిందపడ్డాయి.  వెంటనే మోడీ స్పందించారు. కిందపడిన ఆ పువ్వును తీసి వెనుకనున్న సిబ్బందికి అందజేశారు.  మాములుగా అలాంటి హోదా లో ఉన్న వ్యక్తులు వాటి గురించి పట్టించుకోరు. కానీ, మోడీ మాత్రం అలా కాదు.. ఇప్పటికే పర్యావరణంపై పోరాటం చేస్తామని, క్లీన్ ఇండియా అంటూ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు.  అలాంటి సమయంలో మోడీ కిందపడిన వస్తువులను ఎందుకు తీయరు చెప్పండి.  


గతంలో కంటే మోడీకి ఈసారి మంచి స్వాగతం లభించింది.  వచ్చిన వెంటనే టెక్సాస్ లోని చమురు సంస్థల సీఈవోలతో మీటింగ్ జరిపారు.  అనేక ఒప్పందాలు చేసుకున్నారు.  ఫ్యూచర్లో ఇండియాలో  పెట్టుబడులు పెట్టేందుకు సదరు సీఈవోలు కూడా అంగీకరించినట్టు సమాచారం.  ఇక ఈరోజు జరిగే కార్యక్రమం కోసం 200 లకు  పైగా కార్లతో ర్యాలీ జరగబోతున్నది.  ఈ ర్యాలీలో మోడీతో పాటు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు.  ఇప్పుడు ప్రపంచ మీడియా మొత్తం హ్యూస్టన్ లో ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: