కాంగ్రెసోళ్లకు దేనిపై ఏది మాట్లాడాలో కూడా తెలియడం లేదని  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అంతకు ముందు ఆయన ప్రవేశపెట్టిన  ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నడిచాయి. 58 గంటల 6 నిమిషాలు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. ధైర్యం, ప్రజల విశ్వాసం ఉంది కాబట్టే ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు పోయినమన్నారు. 



తాయిలాలు ఇచ్చి మేము ఎన్నికలు పోలేదు. ప్రజా మద్దతుపై నాకు నమ్మకం ఉంది.. ఎన్‌ఆర్‌సీపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఓల్డ్‌సిటీలో కూడా మెట్రో రైలు విస్తరిస్తామని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అనుసరిస్తోంది. అవసరమైతే అసెంబ్లీలో 12శాతం రిజర్వేషన్లపై తిర్మానం చేద్దామన్నారు. 33 జిల్లాల్లో ఎవరిని అడిగిన కూడా టీఆర్‌ఎస్ పాలన అద్భుతంగా ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 9కి పడిపోయింది. బీజేపీ 5 సీట్ల నుంచి ఒక సీటుకు పడిపోయింది. టీఆర్‌ఎస్ పార్టీ 63 నుంచి 88కి పెరిగింది.  కాగా  అసెంబ్లీ కమిటీలను స్పీకర్ పోచారం  ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి,




పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు. అసెంబ్లీ కమిటీలను స్పీకర్ ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నడిచాయి. 58 గంటల 6 నిమిషాలు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: