ఎన్నికల్లో ఓడిపోవటం .. గెలవడం సహజమే. కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోతేనే భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఎన్నికలో జనసేన పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. మరీ ఆ ఓటమి నుంచి పవన్ పాఠాలను నేర్చుకుంటారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. పవన్ కళ్యాణ్ కు చరిష్మా ఉంది. రాష్ట్రంలో యూత్ లో బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే రాజకీయాల్లో రాణించాలంటే ఇవి మాత్రం సరిపోవు. పవన్ ఒక లీడర్ గా తనను తాను నిరూపించుకోవాలి. సభల్లో మాట్లాడే విధానంలో మార్పు రావాలి. అర్ధం పర్ధం లేకుండా .. సమయం సందర్భం లేకుండా సినిమా డైలాగ్స్ వాడితే ప్రజల్లో బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ కాలేరు.


ఏదైనా మాట్లాడే ముందు ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడాలి.అదే ధోరణిలో విమర్శించాలి. ఈ విషయంలో చంద్రబాబు నుచి జగన్ నుంచి పవన్ చాలా నేర్చుకోవాలి. కానీ పవన్ ఎవరు చెప్పినా వినడని .. నేర్చుకునే నైజం కాదని పార్టీలోని కొంత మంది నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్.  సభలో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం వరకే పవన్ రాజకీయం పరిమితం అవుతుంది. ఏ ఒక్క ప్రాబ్లెమ్ మీద గట్టిగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. పవన్ ఇక నుంచైనా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవటం మంచిది. జనసేన .. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి.


జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: