రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైనా అనుకున్న ల‌క్ష్యాన్ని అలవోక‌గా చేరుకున్నారు. ప్ర‌జా ధనం వృథా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చూశారు. ఎన్నో ఆరోప‌ణల మ‌ధ్య జ‌గ‌న్ తీసుకున్న రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్ణ‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యింది. అన్ని ప్ర‌తిఘ‌ట‌న‌లు దాటుకుని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో ఎక్కువ‌కు టెండ‌ర్ ద‌క్కించుకున్న కంపెనీతోనే.. దాదాపు రూ. 60 కోట్లు త‌క్కువ‌కు ప‌నులు ద‌క్కించుకునేలా చేసి సీఎం జ‌గ‌న్ అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. త‌న గొప్ప‌త‌నాన్ని చాటుకోవ‌డం కోసం, ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకుని ప్రెస్‌మీట్‌లు పెడుతున్న చంద్ర‌బాబుకు రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో ముఖం వాచిపోయేలా సమాధానం చెప్పాడు. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న తాను దిగిపోవడంతో రాష్ట్రం దిక్కులేనిదైపోయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప‌రిపాల‌నా అనుభ‌వం లేదు. అప్పుల పాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని న‌డిపించ‌డం అంత ఈజీ కాద‌న్న‌ట్టు ప్రజలను పక్క దరి పట్టించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు వైఎస్ జ‌గ‌న్‌. 


 
పోల‌వ‌రం ప్రాజెక్టులో రూ. 300 కోట్ల ప‌నుల్లో దాదాపు రూ.60 కోట్లు ఆదా చేసి చూపించాడు. అది కూడా గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో టెండ‌ర్ ద‌క్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీతోనే కావ‌డం విశేషం. మ‌రోప‌క్క పోల‌వరం ప‌నుల్లో ఎలాంటి అవినీతి జ‌ర‌గలేద‌ని క్లీన్ చిట్‌లు ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా నిన్న జ‌రిగిన టెండ‌ర్‌తో గ‌ట్టి షాక్ త‌గిలింది. మ‌రోప‌క్క టీడీపీ ప్ర‌భుత్వం గ‌తంలో పిలిచిన కంపెనీయే 20  శాతం త‌క్కువ‌కు టెండ‌ర్ ద‌క్కించుకోవ‌డం చూసి టీడీపీ నాయ‌కుల ప‌రిస్థితి క‌క్క‌లేక మింగ‌లేకుండా ఉంది. మ‌రోవైపు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నోరెత్త‌లేని ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు. తాను టెండ‌ర్ల గురించి ష‌రామామూలుగానే ఆరోప‌ణ‌లు చేస్తే తన అవినీతి బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని మిన్న‌కుండాల్సి వ‌స్తోంది. అంతేకాకుండా ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేంద్ర‌మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చి పోల‌వ‌రం విషయంలో చంద్ర‌బాబుపై తీవ్రంగా విరుచుకుప‌డిపోయారు.




పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు ఏటీఎంలా వాడుకున్నాడ‌ని విమ‌ర్శించి వెళ్లారు. అలాంటి న‌రేంద్ర‌మోడీ స‌ర్కారు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చాక పోల‌వ‌రంలో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని క్లీన్‌చిట్ ఇవ్వ‌డం చూసి ఏపీ ప్ర‌జ‌లు నివ్వెర‌పోయారు. కేంద్రం చేప‌ట్టాల్సిన పోల‌వ‌రం ప్రాజెక్టును తాను ద‌క్కించుకున్న చంద్ర‌బాబు... అయిదేళ్ల కాలంలో పూర్తి చేయ‌లేక చ‌తిక‌ల‌బ‌డ‌టమే కాక ఆ నెపాన్ని బీజేపీ మీద నెట్టాల‌ని చూశాడు. అయితే జ‌గ‌న్ మాత్రం ఎక్క‌డా ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌కుండా తననుకున్నది అనుకున్నట్టు చేసి చూపించారని ఈ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ చంద్ర శేఖర్ రాజు(శేఖర్) స్పష్టం చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: