వైసీపీ అధినేతగా జగన్ ఉన్నపుడే నయం. ఆయన జనంలో ఏం జరుగుతుందో క్షణంలో తెలుసుకునే వారు. ఆయన ఎపుడూ ప్రజలలో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉండేవి. ప్రతీ సమస్య జగన్ చెవి దాటి పోయేది కాదు. జగన్ సైతం అలెర్ట్ గా ఉంటూ వచ్చారు. ఇపుడు పరిస్థితి మారింది. జగన్ అధికారంలో ఉన్నారు. పైగా ఎంతో వత్తిడి బిజీ లైఫ్ గా ఉన్న సీఎం పదవిలో ఆయన ఉన్నారు.



దాంతో జగన్ కి సరైన ఫీడ్ బ్యాక్ చేరుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. జగన్ కి అన్నీ పాజిటివ్ న్యూస్ గానే వినిపిస్తూ అధికారులు పబ్బం గడుపుకుంటున్నారని అంటున్నారు. దాంతో జగన్ కి గ్రౌండ్ లెవెల్లో జరిగే కార్యక్రమాలు, వాటి ప్రభావం, రియాలిటీ అన్నవి చేరడంలేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. జగన్ ఈ విషయంలో ఇంతకు ముందులా అలెర్ట్ కాలేకపోలేకపోవడానికి ఇదే కారణం అంటున్నారు. మరో వైపు నాయకులు సైతం జగన్ వద్దకు వెళ్ళి ప్రభుత్వ పరిస్థితి గురించి వివరించేందుకు కూడా సాహసించడంలేదని అంటున్నారు.



దాని వల్ల దిగువ స్థాయిలో జరుగుతున్న అనేక కీలకమైన పరిణామాలను జగన్ పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదని అంటున్నారు. నిజానికి నాలుగు నెలల కాలంలొ జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్దగా లేకపోయినా టీడీపీ దాని అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతం వల్ల జనంలో అభిప్రాయాలు మారే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా ఇసుక పాలసీ వల్ల కూడా జనంలో అసంత్రుప్తి  ఉంది. అధికారులను జగన్ నమ్మడం వల్ల ఎమ్మెల్యేలను  వారు పట్టించుకోవడంలేదు. మరో వైపు జగన్ పధకాలను వరసగా ప్రకటించుకునిపోతున్నారు. వాటి పర్యవశానాలు, ప్రభావం కూడా ఆయన పెద్దగా గమనంలోకి తీసుకోవడంలేదు. మరి ఈ విధంగా ముందుకు వెళ్తే లోకల్ బాడీ ఎన్నికల్లో కొంచెం కష్టమేనన్న మాట వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: