నిజంగా .. రాష్ట్రాన్ని అల్లరల్లరి చెయ్యాలన్న.. గొడవలు సృష్టించాలన్నా కేవలం చంద్రబాబుకె సాధ్యం అవుతుంది. అటుపక్క ఉన్నదీ ఎలాంటి రాజైనాసరే బురద జల్లడానికి రెడీగా ఉంటాడు మన 70 ఏళ్ళ బాబు. ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కనీసం అంటే కనీసం ఆరునెలలు సమయం ఇవ్వాలి.                            


కానీ ఈ విషయం ఈ చంద్రబాబుకి తెలియదు. ఈ ఆరునెలల్లో కొత్త ప్రభుత్వం ఎలాంటి పని చేసిన చూస్తూ ఉండి ఆరునెలల తర్వత మాట్లాడాలి. కానీ బాబు 100 రోజులపాలన సరిగ్గా లేదని ధర్నాలు, మరోవైపు శవరాజకీయాలు. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన సమయం నుంచి ఏం అంత కొంపలు మునిగిపోయేలా వాళ్ళ పాలన దుర్మగంగా ఉంది ?                         


మీరు అక్రమంగా కట్టుకున్న ప్రజావేధికను అక్రమం అని ప్రభుత్వం కూల్చేసింది అది దుర్మార్గమా ?  మీ ప్రభుత్వంలో కుటుంబ సమేతంగా ప్రజలను, అసెంబ్లీని దోచుకొని పట్టుబడిన కోడెలను పట్టుకోవడం దుర్మార్గమా ? వైసీపీ ప్రభుత్వం పెట్టిన మానసిక క్షోభ వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడా ?                               


అబ్బా .. ఎంత బాగా చందమామ కథలు చెప్తావు చంద్రబాబు. 14 ఏళ్ళ పాలనలో నువ్వు చెయ్యలేని పనులు నువ్వు తీసుకోలేని సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర ప్రజల ముఖాల్లో యువ ముఖ్యమంత్రి నవ్వులు పూయిస్తుంటే ఎందుకు నీకు ఇంత బాధ ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.                                      


మరింత సమాచారం తెలుసుకోండి: