తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటున్న కమలం పార్టీ... హుజూర్ నగర్ లో ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్ నగర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన కాషాయ పార్టీ.. ఇప్పుడు ఎవర్ని అభ్యర్థిగా దించబోతుందనే విషయంపై చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్ కమిటీ భేటీ తర్వాత అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది. 


హుజూర్ నగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ రావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులెవరో తేలిపోయింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. తెలంగాణ లో భవిష్యత్ తమదే నని అంటున్న బీజేపీ హుజుర్ నగర్ లో సత్తా చాటాలనుకుంటోంది. అక్కడ చెప్పుకో తగ్గ ఓట్లు తెచ్చుకోవాలని భావిస్తోంది. లోక్ సభ ఫలితాలతో వచ్చిన ఊపును కోల్పోవద్దనుకుంటోంది. అందుకోసం అక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దించాలని డిసైడ్ అయింది.


అయితే పార్టీలో ఉన్న వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు చెందిన ఒక ప్రముఖ నేత కుటుంబం నుండి ఒకరిని బరిలోకి దించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడైన రాంరెడ్డి.. రీసెంట్ గా బీజేపీలో చేరారు. నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన టీడీపీ నేత శ్రీకళ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడ్డ అప్పిరెడ్డి కూడా కాషాయ నేతలకు టచ్ లో ఉన్నారు. వీరిలో ఎవరు బరిలో ఉన్నా.. బీజేపీ చెప్పుకోదగ్గ ప్రభావం చూపెడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. 


గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి కేవలం 15 వందల ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను బట్టి బీజేపీకి అంత సీన్ లేనట్టు కనిపిస్తోంది. అర్థబలం, అంగబలం ఉన్న వ్యక్తిని బరిలోకి దించితే తప్ప.. బీజేపీ అనుకున్న ఫలితం సాధించే అవకాశం లేదు. ఎల్లుండి జరిగే బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో అభ్యర్థి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: