ఇండియా పాక్ మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతూనే ఉన్నది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ ఇండియాపై ఒంటికాలిపై లేవడం మొదలు పెట్టింది.  అంతర్జాతీయంగా ఇండియా పై కంప్లైంట్ చేస్తూ వస్తున్నది.  ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పెద్దగా ఫలితం ఉండదు అనే సంగతి పాపం పాక్ తెలియడం లేదు.  అంతర్జాతీయ భద్రతా మండలిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కాశ్మీర్ విషయం గురించి చర్చించి .. మూడో దేశం అవసరం లేదని తేల్చి చెప్పారు.  


అక్కడితో ఆగకుండా.. జెనీవాలో మానవహక్కుల సంఘంలో ఓ ప్రతిపాదనను తీసుకురావాలి అని చూసింది.  కానీ, ప్రతిపాదనను స్వీకరించాలి అంటే.. సభ్యదేశాల్లో సగం అందుకు ఆమోదించాలి.  సభ్యదేశాల ఆమోదం కోసం పాపం పాక్ చాలా ప్రయత్నం చేసింది.  చివరకు ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయలేదు.  చైనాకు అత్యంత మిత్రదేశంగా చెప్పుకున్న చైనా కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఒంటరి అయ్యింది.  


దీంతో పాక్ ప్రధాని తన అసహనాన్ని వ్యక్తం చేశారు.  ఈనెల 23 నుంచి ఐరాసలో జరిగే సర్వ సభ్య దేశాల సదస్సులో కాశ్మీర్ అంశాన్ని ప్రధానాంశంగా తీసుకొస్తామని అంటున్నాడు.  చైనా మాత్రం కాశ్మీర్ అంశం ప్రధానాంశం కాకపోవచ్చని ఇప్పటికే స్పష్టం చేసింది.  ఇక అటు పాక్ అక్టోబర్ లో ఇండియాతో యుద్ధం చేస్తామని పట్టుబడుతున్నారు.  వారి పట్టుదలను ఎందుకు కాదనాలి.  


ఒకసారి యుద్దానికి దిగితే ఈసారి పీవోకే తో పాటు పాక్ ను కూడా ఇండియా ఆక్రమించుకుంటుంది.  అందులో సందేహం అవసరం లేదు.  పాక్ అందుకు సిద్ధమైతే ఇండియాతో యుద్ధం చేయడానికి ముందుకు రావాలని ఇండియా అంటోంది.  పాక్ మాత్రం సాంప్రదాయక యుద్ధంలో గెలవలేకపోయినా తమదగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, వాటితో యుద్ధం చేసి ఇండియాను అంతం చేస్తామని అంటున్నారు.  ఎలాంటి యుద్ధానికైనా ఇండియా సిద్ధంగా ఉంది.  పాక్ ధైర్యం చేసి అడుగు ముందుకు వేస్తుందా అన్నది డౌట్.  


మరింత సమాచారం తెలుసుకోండి: