తెలంగాణ ఆడపడుచులు పండుగ రోజు కొత్త చీరలు కట్టుకోవాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కి శ్రీకారం చుట్టుంది. ఈ ఈ క్రమంలోనే ఈ ఏడు బతుకమ్మ చీరల పంపిణీ కి సర్వం సిద్ధం చేస్తుంది. బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం గత 6 నెలల నుండే  కసరత్తులు చేస్తుంది .  18 సంవత్సరాల నిండి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది  అన్న విషయం తెలిసిందే. కానీ బతుకమ్మ చీరల పంపిణీ సూర్యాపేట జిల్లాలో నిలిపివేయబడింది . సూర్యాపేట జిల్లాలో మొత్తం 3, 69, 703 మహిళలు ఉండగా... ఇప్పటికే 1,95, 000 చీరలను  జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు  పంపించగా గౌడంలలో  దాచి ఉంచి గ్రామాల వారీగా పంపిని  చేపట్టేందుకు అధికారులు కూడా సంసిద్ధమయ్యారు. కానీ హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో మొత్తం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పంపిణీ కాస్త ఆగిపోయింది. ఇది అక్కడి మహిళకు చేదు వార్త. ఎందుకంటే రాష్ట్రమంతటా జరుగుతున్న బతుకమ్మల చీరల పంపిణీ ఎన్నికల కోడ్ అమలు వల్ల సూర్యాపేట జిల్లాలో  నిలిపివేశారు. 

 

 

అయితే ఈసారి బతుకమ్మ చీరల్లో  ప్రభుత్వం నాణ్యతను పెంచడంతోపాటు... పది రకాల కలర్స్ తో 100 రకాల  చీరల్ని ప్రభుత్వం తయారు చేయించింది . అయితే బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూర్యాపేట జిల్లా మహిళల   ఆశలపై ఎన్నికల కోడ్ నీళ్లు చల్లినట్లు అయింది. కాక హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21 నిర్వహించేందుకు ఈసీ  నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఉండడం వల్ల సూర్యాపేట జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: