రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అద్భుతమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని వాస్తవ రైతులకు అన్యాయం, నష్టం జరుగనీయమన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో ఎవరు అడ్డుపడినా సహించబోమని, రాష్ట్రం బాగు పడాలని,ప్రజలకు మేలు కలగాలనే దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళుతున్నాం.ఉద్యమంలో ఎవరికీ భయపడలేదు. రాష్ట్రంలో లంచం లేని పరిస్థితి రావాలి. ఇందుకు దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం.చట్టాలు మార్చొద్దు. కొత్తవి తేవొద్దు అంటే నడుస్తదా? అవసరమైతే కొత్త చట్టాలు తేవాల్సిందే.దీనిపై నలుగురు ఉద్యోగులకో,లేక మరెవరికో భయపడేది లేదు.



చట్టాలు రూపొందించేది ఉద్యోగులు కాదు.వారు ప్రభుత్వం చెప్పిన పని మాత్రమే చేయాలి.ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఉండదని,ఉద్యోగులే ప్రభుత్వాన్ని శాసించి..చట్టాలు చేస్తే ఇక శాసన సభ,ఎమ్మెల్యేలు ఎందుకని నిలదీశారు.ఇక వీఆర్వో వ్యవస్థను తీసేస్తామని మేం చెప్పినమా? దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి.ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పకుండా తొలగిస్తాం.వీఆర్వోలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా,అంటూ ఘాటుగా మాట్లాడారు.ఎవరో నాయకుల పిచ్చి మాటలు పట్టుకుని సమ్మెలు చేయవద్దు. ఉద్యోగులను ఎట్ల చూసుకోవాలో మాకు తెలుసు.శాసనసభలో..శాసనసభ్యులుచేసిన చట్టాలను వ్యతిరేకిస్తామంటే ఎలా..ప్రజలు,రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు తీసుకొస్తున్నం అని పేర్కొన్నారు.



ఇక తెలంగాణ అంశం గురించి మాట్లాడుతూ.ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉందని,అన్ని రంగాలపై దీని ప్రభావం ఉంటుందని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.పరిస్థితులు మెరుగుపడితే బడ్జెట్‌ పెంచుతాం.మేమేమీ దేవుని కొడుకులం కాదు.కేంద్రం నుంచి పన్నుల రూపంలో నిధులు రావాలి.ఆశించిన స్థాయిలో నిధులు వస్తే ఫర్వాలేదు. లేదంటే మరిన్ని కోతలు తప్పవు అని స్పష్టం చేశారు.ప్రజలకు భ్రమలు కల్పించడం లేదని,నిధులు వస్తే.కేటాయిస్తామని చెప్పారు.రాష్ట్రానికి రావాల్సిన పన్నుల్లో కేంద్రం కోత విధిస్తుందని భయపడుతున్నాం.కేంద్రం నుంచి రావాల్సిన రూ.1400 కోట్లు వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే కదా..పథకాలకు పెట్టేది’’అని ఈ సందర్భంగా సృష్టం చేసారు..



మరింత సమాచారం తెలుసుకోండి: