చూస్తుంటే కొద్దిరోజుల్లోన ఇండియా పెట్టుకున్న టార్గెట్ పూర్తయ్యేలానే కనిపిస్తోంది.  ఇండియా అనుకున్నట్టుగా ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా ఇండియాలో విలీనం చేసుకున్నది.  ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకొని జమ్మూ కశ్మీర్ లో ఆటంకవాదులు అరాచకాలకు పాల్పడుతున్నారని హౌడీ మోడీ సభలో మోడీ పేర్కొన్నారు.  ఉగ్రవాదంపై భారత్ పోరాటం  చేస్తుందని స్పష్టం చేశారు. అమెరికా సైతం ఉగ్రవాదంపై పోరు చేస్తున్న సంగతి గుర్తు చేశారు ట్రంప్.  


ఉగ్రవాదంపై భారత్ తో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. హౌడీ మోడీ సభలో పాల్గొన్న ట్రంప్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి తీవ్రంగా అణిచివేస్తాని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.  దీంతో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే దానిపై పోరాటం తీవ్రంగా ఉంటుందని చెప్పారు.  అనంతరం మోడీ కూడా అదే విధమైన వాయిస్ ను వినిపించారు.  అమెరికా ట్విన్ టవర్స్, ముంబై దాడుల వెనుక ఎవరు ఉన్నారో అందరికి తెలుసునని,వారిని పెంచి పోషించింది ఎవరో కూడా తెలుసునని మోడీ చెప్పారు.  


వారికీ ఎలా బుద్దిచెప్పాలో అలానే తమకు తెలుసునని, తమ దేశం జోలికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మోడీ స్పష్టం చేశారు.  ట్రంప్ సైతం బోర్డర్ విషయంలో కఠినంగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ను ఇండియాలో పూర్తిగా విలీనం చేయడం జరిగింది.  ఇక మిగిలిన పీవోకే ను కూడా ఇండియాలో విలీనం చేసుకోవడానికి ఇంకెంతో దూరం లేదని హౌడీ మోడీ కార్యక్రమం ద్వారా తేలిపోయింది.  


పీవోకేను ఇండియాకు తిరిగి స్వచ్చందంగా అప్పగించాలని పాక్ పై ఒత్తిడి మొదలౌతున్నట్టు తెలుస్తోంది.  ప్రపంచదేశాలు పాక్ పై ఇదే విధమైన ఒత్తిడిని తీసుకురాబోతున్నాయి.  అటు సియాచిన్ ను కూడా ఇండియాకు అప్పగించే విధంగా చైనాపై ఒత్తిడి పెరగొచ్చు.  ఎందుకంటే చైనాకు హాంకాంగ్ పెద్ద తలనొప్పిగా మారింది.  ఆ దేశం చిన్నదే అయినా.. చైనా అధీనంలో పనిచేస్తున్నది.  ఇప్పుడు ఆ దేశం పూర్తిగా స్వతంత్రం కోరుకుంటూ పోరాటం చేస్తున్నది.  బలమైన ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా చిన్న దేశాన్ని ఏమి చేయలేకపోతున్నది. 


ఇదే విధమైన ఒత్తిడిని సియాచిన్ విషయంలో కూడా తీసుకొచ్చేందుకు ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఒకవేళ చైనాకు సంబంధించిన వస్తువులను ట్రేడింగ్ ను పూర్తిగా బహిష్కరిస్తే చైనా ఆర్ధిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింటుంది.  అప్పుడు చైనా దారిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.  అక్టోబర్ లో జిన్ పింగ్ ఇండియా పర్యటనలో భాగంగా ఈ విషయాల గురించి ప్రస్తావనకు రావొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: