ప్రతిపక్షంలో ఉన్నపుడు నీతులు, విలువల గురించి చంద్రబాబునాయుడుకన్నా మించి మాట్లాడే రాజకీయ నేత మరొకరుండరు.  గ్రామ సచివాలయాల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని చంద్రబాబు, చినబాబు డిమాండ్ చేస్తున్నారు. జగన్ కానీ లేకపోతే విద్యా, పంచాయితి రాజ్ శాఖల మంత్రులైనా  రాజీనామా చేయాలట.

 

ఎందుకు రాజీనామాలు చేయాలంటే ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేయాలని జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు బహిరంగ లేఖే రాసేశారు. నైతిక బాధ్యత ఒక్క జగన్ , మంత్రులకేనా ? చంద్రబాబు, చినబాబులకు ఉండదా ? అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

 

చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు ప్రశ్నపత్రం లీకైన విషయం నిర్ధారణ కాలేదు. లీకైందని ఎల్లోమీడియా చెబుతోంది. కాలేదని ప్రభుత్వం అంటోంది. కాబట్టి ఈ విషయమై క్లారిటి రావటానికి కొద్ది రోజులు పడుతుంది. అయితే ఈలోపే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని సాక్ష్యాధారాలతో సహా ఓ విషయంలో రుజువైంది.

 

పోలవరం ప్రాజెక్టులో భాగంగా 65వ ప్యాకేజి పనులను మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెనీ దక్కించుకుంది. 274 కోట్ల రూపాయల పనుల్లో 15.6 శాతం తక్కువకు కోట్ చేసిన కారణంగా పై కంపెనీ పనులు దక్కించుకుంది. ఇదే పనిని ఇదే కంపెనీ చంద్రబాబు హయాంలో 4.77 శాతం ఎక్సెస్ కు దక్కించుకుంది. అప్పట్లో ఎక్సెస్ ధరలు కోట్ చేసిన ఇదే కంపెనీ ఇపుడు రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువకే ఎందుకు కోట్ చేసింది ?

 

ఎందుకంటే అప్పట్లో ప్రతీ పనిలోను భారీ అవినీతే కాబట్టే అప్పుడలా ఎక్కువకు కోట్ చేసిందని అర్ధమైపోయింది. మొత్తం మీద 20 శాతం తక్కువ కోట్ చేయటం వల్ల ప్రభుత్వానికి సుమారు 58 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని తేలింది. అంటే చంద్రబాబు వల్ల అంతే మొత్తం నష్టం జరిగిందనే కదా అర్ధం ? మరి ప్రభుత్వానికి నష్టం చేసినందుకు కుప్పం ఎంఎల్ఏగా చంద్రబాబు, ఎంఎల్సీగా చినబాబు తమ పదవులకు రాజీనామాలు చేస్తారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: